Diwali Celebrations: సరోజినీ కంటి ఆస్పత్రికి బాధితుల తాకిడి.. ఇప్పటివరకు 32 కేసులు నమోదు..

దీపావళి సంబరాల నేపథ్యంలో సరోజినీ దేవి కంటి ఆస్పత్రికి బాధితుల తాకిడి పెరుగుతోంది. వివిధ కంటి సమస్యలతో ఎక్కువమంది హాస్పిటల్‌కి చేరుకుంటున్నారు

Diwali Celebrations: సరోజినీ కంటి ఆస్పత్రికి బాధితుల తాకిడి.. ఇప్పటివరకు 32 కేసులు నమోదు..

Updated on: Nov 05, 2021 | 8:24 AM

దీపావళి సంబరాల నేపథ్యంలో సరోజినీ దేవి కంటి ఆస్పత్రికి బాధితుల తాకిడి పెరుగుతోంది. వివిధ కంటి సమస్యలతో ఎక్కువమంది హాస్పిటల్‌కి చేరుకుంటున్నారు. ఇప్పటివరకు మొత్తం 32 కేసులు నమోదైనట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. సమస్య తీవ్రత తక్కువగా ఉన్న వారికి ప్రాథమిక చికిత్స చేసి ఇంటికి పంపుతుండగా.. తీవ్రంగా గాయపడిన వారిని ఆస్పత్రిలో చేర్చుకుని చికిత్స అందజేస్తున్నారు. ఆస్పత్రికి వచ్చే బాధితుల్లో ఎక్కువగా చిన్నపిల్లలే ఉన్నారని, సాయంత్రంలోపు మరిన్ని కేసులు వచ్చే అవకాశముందని డాక్టర్లు చెబుతున్నారు. ప్రస్తుతం తీవ్రంగా గాయపడిన ముగ్గురు పిల్లలను ప్రత్యేక అబ్జర్వేషన్‌లో ఉంచి చికిత్స అందజేస్తున్నామన్నారు.

చిన్న పిల్లలే ఎక్కువ..
గురువారం రాత్రి నుంచే సరోజినీ దేవి కంటి ఆస్పత్రికి బాధితులు క్యూ కట్టారు. గురువారం రాత్రి 12 గంటల సమయానికే మొత్తం 27 కేసులు నమోదయ్యాయి. ఇందులో 22 ఓపీ కేసులు కాగా, 5 ఇన్ పేషెంట్ కేసులున్నాయి. తీవ్రంగా గాయపడి ఆస్పత్రికి వచ్చిన ఇద్దరికి ఆపరేషన్‌ నిర్వహించారు. బాధితుల్లో చాలామంది కార్నియా, కంజైటైవా సమస్యలతో ఆస్పత్రికి వస్తున్నారని డాక్టర్‌ కవిత వెల్లడించారు. అందులోనూ చిన్న పిల్లల కేసులే ఎక్కువగా ఉన్నాయని, కార్నియా దెబ్బతిని దృష్టి సమస్య ఉన్న వాళ్లకి సర్జరీలు చేస్తున్నామని ఆమె తెలిపారు.

Also Read:

Old City Blast: హైదరాబాద్ పాతబస్తీలో పేలుడు.. ఇద్దరు దుర్మరణం.. మరొకరికి తీవ్రగాయాలు..

Hyderabad Crime News: భాగ్యనగరంలో మరో దారుణం.. పంజాగుట్టలో నాలుగేళ్ల చిన్నారి మృతదేహం లభ్యం..

Farmhouse Casino: ఫామ్‌హౌస్ క్యాసినో కేసులో వెలుగులోకి సంచలనాలు.. బయటపడుతున్న గుత్తా సుమన్ లీలలు..