Hyderabad: గుడ్ న్యూస్.. ఉస్మానియాలో ఉచితంగానే టాటూ, పచ్చబొట్టు తొలగింపు శస్త్రచికిత్సలు

పచ్చబొట్లు, టాటూలు తొలుత ఇష్టంతోనే వేయించుకుంటారు. కానీ కొన్ని పరిస్థితుల్లో వాటిని తీసేయాల్సి రావొచ్చు. ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని. అయితే ఇలాంటివారి కోసం ఉస్మానియా ఆస్ప్రతి గుడ్ న్యూస్ చెప్పింది.

Hyderabad: గుడ్ న్యూస్.. ఉస్మానియాలో ఉచితంగానే టాటూ, పచ్చబొట్టు తొలగింపు శస్త్రచికిత్సలు
Tattoo Removal
Follow us

|

Updated on: Jun 02, 2022 | 9:56 AM

టాటూలు(tattoos), పచ్చబొట్లు అనేవి చాలామంది ఫ్యాషన్ కోసం వేయించుకుంటారు. ఇంకొందరు నచ్చిన వ్యక్తులపై ప్రేమతో వారి పేర్లు వేయించుకుంటారు. అయితే తొలుత ఇష్టంతోనే వేయించుకున్నా.. తర్వాత వాటిని తీయించకోవాల్సిన పరిస్థితి రావొచ్చు. ఫర్ ఎగ్జాంఫుల్ డీప్ లవ్‌లో ఉన్నప్పుడు పచ్చబొట్టు వేయించుకోని.. బ్రేకప్ తర్వాత తీయాల్సిన పరిస్థితి రావొచ్చు. అయితే టాటూలు, పచ్చబొట్లు రిమూవ్ చేయాలంటే కాస్త భారీగానే ఖర్చవుతుంది. అయితే హైదరాబాద్ ఉస్మానియా హాస్పిటల్(Osmania Hospital) గుడ్ న్యూస్ చెప్పింది. వాటిని ఉచితంగానే రిమూవ్ చేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు  సీనియర్‌ ప్లాస్టిక్‌ సర్జన్‌ డాక్టర్‌ నాగప్రసాద్‌ వివరాలు వెల్లడించారు. ఇప్పటికే టాటూలు, పచ్చబొట్లు వేయించుకుని.. వాటిని తీయుంచుకోవాలని అనుకుంటున్నవారు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. శస్త్రచికిత్సలతో తొలగించవచ్చని చెప్పారు. కొన్నిసార్లు లేజర్‌ చికిత్సలు అవసరమవుతాయని.. ఉస్మానియాలో ఇప్పటికే అనేక మందికి చికిత్సలు నిర్వహించినట్లు వెల్లడించారు.

కొన్ని రకాల టాటూలు, పచ్చబొట్లు శరీరం లోపలి పొర అయిన డెర్మిస్‌లోకి చొచ్చుకెళ్తాయి. ఇలాంటి వాటిని తొలగించాలంటే డెర్మ్‌ఎబ్రేషన్‌ అనే ప్రాసెస్ ద్వారా లోపలివరకు చర్మాన్ని రిమూవ్ చేస్తారు. ఆ ప్రాంతంలో స్కిన్‌గ్రాఫ్టింగ్‌ ద్వారా లెవల్ చేస్తారు. అయితే ఆ ప్రాంతంలో గాయం కారణంగా ఏర్పడిన మచ్చలా కనిపిస్తుంది. కాగా ఎలాంటి మచ్చ కనిపించకుండా చేయాలంటే లేజర్‌ ట్రీట్మెంట్ తప్పనిసరి. ఇందుకోసం ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్తే లక్షల్లో ఖర్చవుతుంది. అయితే ఉస్మానియాలో ఈ చికిత్స ఫ్రీగా అందిస్తున్నారు. కాగా టాటూలు, పచ్చబొట్లు వేయించుకునేప్పుడు అత్యంత అప్రమత్తత అవసరమని డాక్టర్లు చెబుతున్నారు. వాటి కోసం వాడే సూదులు క్లీన్‌గా లేకపోతే రక్తం ద్వారా ఎయిడ్స్‌ వంటి ప్రమాదకర వ్యాధులు వ్యాప్తి ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇక కొన్ని రకాల ఆర్మీ జాబ్స్‌కు అప్లై చేయాలంటే ఈ టాటూలు, పచ్చబొట్లు ఇబ్బందిగా మారుతాయి. ఈ క్రమంలోనే తెలంగాణలో పోలీసు ఉద్యోగాలకు సంబంధించి.. రాష్ట్ర పోలీస్ శాఖ క్లారిటీ ఇచ్చింది. వేలిముద్రలకు ఇబ్బంది లేనంతవరకూ టాటూలు, పచ్చబొట్లతో సమస్య లేదని వెల్లడించింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి