Hyderabad: తెలుగు రాష్ట్రాలను కలుపుతూ న్యూగో ఎలక్ట్రిక్‌ బస్‌ సేవలు.. అత్యాధునిక సౌకర్యాలతో..

ఈ సంస్థ తమ సేవలను ఇప్పటికే తెలంగాణ-ఆంధ్రప్రదేశ్‌లను కలుపుతూ సేవలను ప్రారంభించింది. ఇందులో భాగంగా హైదరాబాద్-విజయవాడ మార్గంలో విజయవంతంగా సేవలు అందిస్తోంది. ఉత్తరాధిలో ప్రస్తుతం ఢిల్లీ-చండీగఢ్, ఢిల్లీ-ఆగ్రా, ఢిల్లీ-డెహ్రాడూన్, ఢిల్లీ-సిమ్లా, ఢిల్లీ-జైపూర్, ఆగ్రా-జైపూర్, ఢిల్లీ-లూథియానాలో సేవలు అందిస్తుండగా. దక్షిణ భారత దేశంలో బెంగళూరు-తిరుపతి, చెన్నై-తిరుపతి, చెన్నై-పుదుచ్చేరిల మధ్య...

Hyderabad: తెలుగు రాష్ట్రాలను కలుపుతూ న్యూగో ఎలక్ట్రిక్‌ బస్‌ సేవలు.. అత్యాధునిక సౌకర్యాలతో..
Nuego Bus

Updated on: Oct 17, 2023 | 7:17 PM

భారత దేశానికి చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్‌ మెబిలిటీ సంస్థ న్యూగో సేవలను విస్తరిస్తోంది. ఈ సంస్థ నుంచి ప్రీమియం ఇంటర్‌ సిటీ ఏసీ బస్సు సేవలను అందిస్తోంది. ఇప్పటికే ఉత్తర భారతదేశంలో పలు ప్రధాన మార్గాల్లో బస్‌ సర్వీసులను తీసుకొచ్చిన న్యూగో తాజాగా మరో కొత్త మార్గంలో సేవలను పరిచయం చేసింది. తమ సేవలను హైదరాబాద్-ఏలూరు సేవలను పొడిగిస్తున్నట్లు సంస్థ తెలిపింది.

ఈ సంస్థ తమ సేవలను ఇప్పటికే తెలంగాణ-ఆంధ్రప్రదేశ్‌లను కలుపుతూ సేవలను ప్రారంభించింది. ఇందులో భాగంగా హైదరాబాద్-విజయవాడ మార్గంలో విజయవంతంగా సేవలు అందిస్తోంది. ఉత్తరాధిలో ప్రస్తుతం ఢిల్లీ-చండీగఢ్, ఢిల్లీ-ఆగ్రా, ఢిల్లీ-డెహ్రాడూన్, ఢిల్లీ-సిమ్లా, ఢిల్లీ-జైపూర్, ఆగ్రా-జైపూర్, ఢిల్లీ-లూథియానాలో సేవలు అందిస్తుండగా. దక్షిణ భారత దేశంలో బెంగళూరు-తిరుపతి, చెన్నై-తిరుపతి, చెన్నై-పుదుచ్చేరిల మధ్య ఎలక్ట్రిక్‌ బస్‌ సర్వీసులను అందిస్తోంది.

తాజాగా కొత్త రూట్ ప్రారంభించిన నేపథ్యంలో గ్రీన్‌సెల్ మొబిలిటీ సంస్థ సీఈఓ, ఎండీ దేవేంద్ర చావ్లా మాట్లాడుతూ.. ‘వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌, ఏలూరు పట్టణాలను కలుపుతూ న్యూగో ఎలక్ట్రిక్ బస్సు సేవలను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ఈ కొత్త మార్గం ద్వారా కనెక్టివిటీతో పాటు ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణం అందించనున్నాము. గ్రీన్‌ సెల్ మొబిలిటీ ద్వరా న్యూగో.. రవాణా రంగంలో సరికొత్త శకానికి నాంది పలికంది. సౌకర్యం, రక్షణతో పాటు అత్యాధునిక ఫీచర్స్‌ ప్రయాణికులకు సరికొత్త ప్రయాణ అనుభూతిని అందిస్తున్నాము’ అని చెప్పుకొచ్చారు.

ఇక ఈ ఎలక్ట్రిక్‌ బస్సుల్లో సీసీటీవీ నిఘా, డ్రైవర్ బ్రీత్ ఎనలైజర్‌, డ్రైవర్‌ను ఎప్పటికప్పుడు పర్యవేక్షించే వ్యవస్థ, స్పీడ్‌ లిమిట్‌ చెకింగ్ వంటి పటిష్టమైన చర్యాలు తీసుకున్నారు. ప్రయాణికులకు అత్యంత భద్రతతో కూడిన ప్రయాణం అందించే క్రమంలో న్యూగో బస్సులను 25 రకాల భద్రతా పరమైన పరీక్షలను చేపడుతోంది. బస్సులో ఫ్లైట్‌ జర్నీ లాంటి అనుభూతిని ఇస్తుందని కంపెనీ చెబుతోంది. మొబైల్ ఛార్జింగ్ పాయింట్స్‌, విశాలమైన లెగ్‌ స్సేస్‌ వంటి ఫీచర్స్‌ను అందించారు. ఒక్కసారి చార్జ్‌ చేస్తే ఈ బస్సులు 350 కిలోమీటర్లు ప్రయాణించగలవు.

ఈ ఎలక్ట్రిక్ కోచ్‌లు ట్రాఫిక్ పరిస్థితులలో ఎయిర్ కండీషనర్‌లను నడుపుతున్నప్పుడు కూడా ఒక్కసారి ఛార్జింగ్‌తో 250 కిలోమీటర్లు ప్రయాణించగలవు. న్యూగో బస్సులో ప్రయాణించాలనుకునే వారి న్యూగో అధికారిక వెబ్‌సైట్‌తో పాటు, న్యూగో మొబైల్‌ యాప్‌, రెడ్‌బస్‌, పేటీఎమ్‌ లేదా అభిబస్ వంటి డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌ ద్వారా బుక్‌ చేసుకోవచ్చు.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..