మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత హైదరాబాదీలకు ప్రయాణం సులభతరమైంది. ట్రాఫిక్ పద్మవ్యూహాన్ని తప్పించుకొని ఎంచక్కా వేగంగా గమ్యస్థాలకు చేరుకుంటున్నారు. ఒకప్పుడు గంటలు పట్టిన ప్రయాణ సమయం ఇప్పుడు భారీగా తగ్గిపోయింది.
ఇక టెక్నాలజీని విరివిగా వాడుకుంటున్న హైదరాబాద్ మెట్రోరైల్ ట్రైన్ టికెట్ బుకింగ్ విషయంలో కూడా టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. స్టేషన్‌లో క్యూ లైన్లలో నిలబడే అవసరం లేకుండా ఫోన్‌లోనే యాప్‌ల ద్వారా టికెట్ బుక్ చేసుకునే అవకాశం కల్పించారు. అయితే తాజాగా నేరుగా వాట్సాప్ ద్వారా టికెట్ బుక్ చేసుకునే సదుపాయం తీసుకొచ్చారు. ఇంతకీ వాట్సాప్‌లో మెట్రో టికెట్ ఎలా బుక్ చేసుకోవాలి.? ఇందుకోసం పాటించాల్సిన స్టెప్స్ ఏంటో.? ఇప్పుడు తెలుసుకుందాం..
* ఇందుకోసం ముందుగా ఈ స్మార్ట్ ఫోన్‌లో 918341146468 నెంబర్‌ను సేవ్ చేసుకోవాలి. అనంతరం మీ వాట్సాప్ యాప్‌ను ఓపెన్ చేసిన పైన పేర్కొన్న నెంబర్‌కు ‘Hi’ అని మెసేజ్ చేయాలి.
* వెంటనే మీకు ఒక ఓటీపీతో పాటు ఈ టికెట్ బుకింగ్‌కు సంబంధించి ఒక యూఆర్‌ఎల్ గేట్‌వే వస్తుంది.
* ఈ టికెట్ బుకింగ్ యూఆర్‌ఎల్ లింక్‌పై క్లిక్ చేయగానే డిజిటల్ గేట్‌వే వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది.
* ఇందులో మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారో మీ ప్రయాణ వివరాలు ఎంటర్ చేసి. గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎమ్, రూపే డెబిట్ కార్డు వంటి వాటితో పేమెంట్ చేయాలి.
* పేమెంట్ కంప్లీట్ కాగానే మీకు మీ వాట్సాప్‌కు ఈ టికెట్ యూఆర్‌ఎల్ వస్తుంది.
* ఈ టికెట్ యూఆర్‌ఎల్ డౌన్‌లోడ్ చేసుకొని స్టేషన్‌లో క్యూఆర్‌కోడ్ స్కాన్ చేస్తే సరిపోతుంది. టికెట్ జనరేట్ అయిన తర్వాత 24 గంటలోపు ఉపయోగించుకోవచ్చు.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..