Hyderabad: బాబోయ్… నగరంలో మటన్, ఫిష్ ధరలు ఏంటి ఇంత పెరిగాయ్…

బర్డ్‌ఫ్లూ ప్రభావంతో తెలంగాణలో చికెన్ అమ్మకాలు పూర్తిగా పడిపోయాయి. హోల్‌సేల్ షాపులు సైతం వెలవెలబోతున్నాయి. కస్టమర్లు లేక చికెన్ షాపులన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఫంక్షన్ హాళ్లు, రెస్టారెంట్ల నుంచి కూడా ఆర్డర్లు పూర్తిగా తగ్గిపోయాయి. మరోవైపు ఫిష్ మార్కెట్లు, మటన్ షాపుల వద్ద మాత్రం విపరీతమైన రద్దీ కనిపిస్తోంది..

Hyderabad: బాబోయ్... నగరంలో మటన్, ఫిష్ ధరలు ఏంటి ఇంత పెరిగాయ్...
Fish

Updated on: Feb 24, 2025 | 12:51 PM

బర్డ్‌ఫ్లూ ఎఫెక్ట్‌ హైదరాబాద్ మహానగరంలోని బిర్యాని హోటల్స్‌పైనా పడింది. గత వారం రోజుల నుంచి హైదరాబాద్‌లోని అనేక హోటళ్లల్లో చికెన్ పూర్తిగా మాయం అయిపోయింది. బర్డ్‌ఫ్లూ కారణంగా చికెన్ అంటేనే భయపడుతున్నారని.. మటన్‌, సీ ఫుడ్‌కే కస్టమర్లు ఇంపార్టెన్స్ ఇస్తున్నారని హైదరాబాద్ హోటల్ యజమానులు చెప్తున్నారు. ఆదివారం చికెన్ షాప్‌లు కస్టమర్లు లేక వెలవెల బోతుంటే… మటన్ షాపులు, ఫిష్ మార్కెట్ దగ్గర మాత్రం రద్దీ కనిపిస్తోంది.  50 శాతం కంటే ఎక్కువగానే సేల్స్ పడిపోయినట్లు వ్యాపారులు చెబుతున్నారు. హైదరాబాద్‌లో ప్రతి నిత్యం 6 లక్షల కిలోల చికెన్ సేల్ అవుతుండగా.. ప్రస్తుతం 50 శాతం కూడా సేల్స్ లేవని అంటున్నారు. మరికొన్ని రోజులు పరిస్థితి ఇలాగే ఉంటే తాము చాలా నష్టపోయే పరిస్థితి ఉందని వ్యాపారులు వాపోతున్నారు.

డిమాండ్ పెరగడంతో మటన్, ఫిష్ ధరలు కూడా 17 శాతానికి పైగా పెరిగాయి. వారం క్రితం కిలోకు రూ.850 ఉన్న మటన్ రేటు ప్రస్తుతం కిలోకు రూ.1000కి అమ్ముడవుతోంది. నగరంలో చేపల ధరల విషయంలోనూ ఇదే ధోరణి కనిపిస్తోంది. కిలోకు రూ.50-100 పెరుగుదల ఉంది. 

హైదరాబాద్‌లో పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్ల విందుల విషయంలో కూడా బర్డ్ ఫ్లూ భయాల ప్రభావం కనిపిస్తుంది. చాలామంది తమ మెనూల నుండి చికెన్‌ను తీసివేసి, అధిక ధరలు ఉన్నా సరే మటన్, చేపలను చేర్చుతున్నారు. హైదరాబాద్‌లో మటన్, చేపల రేట్లు పెరగడం, చికెన్ ధరలు తగ్గడం అనే ట్రెండ్ ఎంతకాలం కొనసాగుతుందో వేచి చూడాలి.

తెలుగు రాష్ట్రాల్లో బర్డ్‌ ఫ్లూ భయాన్ని తరిమికొట్టేందుకు ఫౌల్ట్రీ ఫెడరేషన్ విసృతంగా ప్రయత్నాలు చేస్తతుంది. ప్రజల్లో బర్డ్‌ ఫ్లూ ఫియర్‌ను తొలగించడమే లక్ష్యంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో చికెన్‌ మేళాలు ఏర్పాటు చేసింది. ఈ మేళాల్లో చికెన్‌ ఫ్రై ఐటెమ్స్‌తోపాటు.. బాయిల్డ్‌ ఎగ్స్‌ను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి