హైదరాబాద్‌లోని ప్రముఖ ప్రదేశాలలో ఎల్బీ స్టేడియం ఒకటి. అయితే.. ఎల్బీ స్టేడియంలో రాజకీయ సమావేశాలు ఏర్పాటు చేయడం వల్ల పాడవుతోందని ఆరోపిస్తున్నారు బేగం బజార్ బీజేపీ కార్పొరేటర్, పలువురు క్రీడాకారులు, కోచ్‌లు. ఎల్బీ స్టేడియాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ స్టేడియం ఎదుట నిరసనలకు దిగారు. వివిధ రాజకీయ పార్టీలు బహిరంగ సమావేశాలకు, విందులు, వినోదాలకు స్టేడియాన్ని వాడుకోవద్దని డిమాండ్ చేశారు. దీని వల్ల స్టేడియం వాతావరణం పాడవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో మంది జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను అందిందిన ఘనత ఈ స్టేడియంకు ఉందని వారు పేర్కొన్నారు. దీంతో.. కార్పొరేటర్‌ను అరెస్ట్ చేసి సైఫాబాద్ పీఎస్‌కు తరలించారు.