హైదరాబాద్ మహానగరంలో మంచినీటి సరఫరాకు పాక్షికంగా అంతరాయం కలగనున్నట్టు హైదరాబాద్ జలమండలి తెలిపింది. కృష్ణా ఫేస్-3 రింగ్ మెయిన్-1 టోలిచౌకి వద్ద ఎస్బీఐ బ్యాంక్ నుండి ఆర్చీస్ స్టోన్ వరకు గల 1400 ఎంఎం డయా ఎమ్ఎస్ పంపింగ్ మెయిన్ కు జంక్షన్ పనులు చేపడుతున్నారు. కాబట్టి 24 గంటల పాటు మంచినీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది. శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి శనివారం రాత్రి 10 గంటల వరకు మంచి నీటి సరఫరా నిలిపోనుంది.
కావున శుక్రవారం (25.06.2021) రాత్రి 10 గంటల నుంచి మరుసటి రోజు అనగా శనివారం (26.06.2021) రాత్రి 10 గంటల వరకు మొత్తం 24 గంటల పాటు ఈ పనులు కొనసాగుతాయి. కాబట్టి ఈ 24 గంటలు కింద ఇవ్వబడిన ప్రాంతాల్లో మంచినీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది.
1. ఓ అండ్ ఎం డివిజన్ నం 3: షేక్ పేట్ రిజర్వాయర్ ప్రాంతాలు.
2. ఓ అండ్ ఎం డివిజన్ నం 6: జూబ్లీ హిల్స్, ఫిల్మ్ నగర్, ప్రశాషన్ నగర్, తట్టిఖాన రిజర్వాయర్ ప్రాంతాలు.
3. ఓ అండ్ ఎం డివిజన్ నం 15: గచ్చిబౌలి, మాదాపూర్, అయ్యప్ప సొసైటీ, కావూరి హిల్స్ రిజర్వాయర్ ప్రాంతాలు.
కావున నీటి సరఫరాలో అంతరాయం కలగనున్న ప్రాంతాల్లోని వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోగలరని కోరడమైనది.
ఫలితంగా షేక్ పేట్ రిజర్వాయర్ ప్రాంతాలు, జూబ్లీ హిల్స్, ఫిల్మ్ నగర్, ప్రశాషన్ నగర్, తట్టిఖాన రిజర్వాయర్ ప్రాంతాలు, గచ్చిబౌలి, మాదాపూర్, అయ్యప్ప సొసైటీ, కావూరి హిల్స్ రిజర్వాయర్ ప్రాంతాల్లో మంచినీటి సరఫరాకు అంతరాయం కలగనుంది.
కావున నీటి సరఫరాలో అంతరాయం కలగనున్న ప్రాంతాల్లోని వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోగలరని హైదరాబాద్ మెట్రోపాలిటన్ నీటి సరఫరా, మురుగునీటి బోర్డు అధికారులు కోరడమైనది.