Telangana: పూజల కోసం మాత్రమే ఫామ్ హౌజ్ కు వెళ్లాం.. నంద కుమార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

|

Oct 28, 2022 | 7:16 AM

తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ క్రమంలో నందకుమార్ స్పందించారు. ఎమ్మెల్యే ల కొనుగోలు అంశం లో వాస్తవం లేదని...

Telangana: పూజల కోసం మాత్రమే ఫామ్ హౌజ్ కు వెళ్లాం.. నంద కుమార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Nanda Kumar
Follow us on

తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ క్రమంలో నందకుమార్ స్పందించారు. ఎమ్మెల్యే ల కొనుగోలు అంశం లో వాస్తవం లేదని నంద కుమార్ అన్నారు. పూజల కోసం మాత్రమే ఫామౌస్ కు వెళ్లినట్లు వివరించారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫిర్యాదు చేసినట్టు తనకు తెలియదన్న నంద కుమార్.. వారిలో ఒక్క ఎమ్మెల్యే మాత్రమే తెలుసన్నారు. మిగతావారు ఎవరో కూడా తనకు తెలియదని చెప్పారు. సింహయాజి స్వామీజీతో సామ్రాజ్య లక్మి పూజ జరిపించడానికి మాత్రమే ఫామౌస్ కు వెళ్లినట్లు వివరించారు. మునుగోడు ఎన్నికల నేపథ్యంలోనే ఎమ్మెల్యేల కొనుగోలుకు బేరసారాలు జరిపినట్లు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఎన్నికలు కాబట్టే ఎలాంటి సమాచారంతో సోదాలు చేశారో తెలియదని ఎద్దేవా చేశారు. అసలు స్కాం గురించి తమకు ఏ మాత్రం తెలియదని, న్యాయాన్ని నమ్ముతున్నాం, న్యాయ స్థానంలో న్యాయం గెలిచిందని వివరించారు. త్వరలో మీడియా కు అన్ని వివరాలు వెల్లడిస్తానని అన్నారు.

ఇష్యూ బయట పడగానే ఒక్కసారిగా టీఆర్ఎస్ నేతలంతా బీజేపీ నేతలకు నందుకు ఉన్న సంబంధాలు ఉన్నట్లు చెబుతున్నారు. సోషల్ మీడియాలో, మెయిన్ మీడియాలో పదే పదే చెప్పుకొచ్చారు. ముఖ్యంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహా మరి కొంత మంది బీజేపీ నేతలతో ఆయన కలిసి ఉన్న ఫోటోలను రిలీజ్ చేశారు. దీంతో ఒక్కసారిగా నందూ ఈ ఎపిసోడ్‌లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోయారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా పని చేసిన కిషన్ రెడ్డి.. తాను పని చేస్తున్న సమయంలో చాలా మందిని కలుస్తుంటానని, ఫొటోలు దిగుతుంటారని, ఆ మాత్రానికి తనకు వారికి సంబంధమేంటని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.

కాగా.. ఈ కేసులో అరెస్ట్ అయిన ముగ్గురు నిందితులను పోలీసులు అవినీతి నిరోధక శాఖ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. ముగ్గురికీ రిమాండ్‌ విధించాలని కోరారు. అయితే రిమాండ్‌కు ఇవ్వాలన్న పోలీసుల విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. నిందితులకు 41 సీఆర్‌పీసీ కింద నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం