హైదరాబాద్‌లోని రియల్ ఎస్టేట్‌కి హాట్ కేకుల్లా ఇప్పుడీ ప్రాంతాలు.. మరో మాదాపూర్ అవ్వడం ఖాయం.!

|

Jun 06, 2024 | 3:39 PM

హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్న ప్రతీ ఉద్యోగి.. ఈ మహానగరం తనకంటూ ఓ ఇల్లు ఉండాలని.. ఎప్పటికైనా కొనాలని కలలు కంటుంటారు. బాగా బిజీగా ఉండే కూకట్‌పల్లి, మియాపూర్, అమీర్‌పేట్, మాదాపూర్ లాంటి ఏరియాల్లో ఒక గజం ల్యాండ్ కొనాలంటే.. కచ్చితంగా లక్షల్లో మాట. ఆ వివరాలు ఇలా..

హైదరాబాద్‌లోని రియల్ ఎస్టేట్‌కి హాట్ కేకుల్లా ఇప్పుడీ ప్రాంతాలు.. మరో మాదాపూర్ అవ్వడం ఖాయం.!
Real Estate
Follow us on

హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్న ప్రతీ ఉద్యోగి.. ఈ మహానగరం తనకంటూ ఓ ఇల్లు ఉండాలని.. ఎప్పటికైనా కొనాలని కలలు కంటుంటారు. బాగా బిజీగా ఉండే కూకట్‌పల్లి, మియాపూర్, అమీర్‌పేట్, మాదాపూర్ లాంటి ఏరియాల్లో ఒక గజం ల్యాండ్ కొనాలంటే.. కచ్చితంగా లక్షల్లో మాట. ఇక 10 లేదా 15 గజాలు అయితే కోట్లు ఖర్చుపెట్టాల్సిందే. మరి అలాంటప్పుడు సామాన్యుడు ఇల్లు లేదా ల్యాండ్ ఎలా కొంటాడు మరి.? డోంట్ వర్రీ.! మీకోసమే ఈ వార్త తీసుకొచ్చేశాం. పాత బస్తీ నుంచి ఆర్ఆర్ఆర్.. ఓఆర్ఆర్ మీదుగా ఎయిర్‌పోర్టుకు మెట్రో అలైన్‌మెంట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు తీసుకొచ్చిన తరుణంలో శంకరపల్లి, మోకిలా ప్రాంతాలు ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌కి హాట్ కేకుల్లా మారాయి.

హైదరాబాద్ ఇన్నర్ సిటీ నుంచి ఔటర్‌లో ఉన్న ఎయిర్‌పోర్ట్‌కి మెట్రోను విస్తరించేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ నేపధ్యంలోనే అవుటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు ఉన్న పలు ప్రాంతాలు భవిష్యత్తులో రియల్ ఎస్టేట్‌కి హాట్ కేకులు అవ్వనున్నాయి. వాటిల్లో రెండు ఈ మోకిలా, శంకరపల్లి. శంకరపల్లి విషయానికొస్తే.. ఇప్పటికే ఈ ప్రాంతం మునిసిపాలిటీ పరిధిలోకి వస్తుంది. ఇక్కడ 1 గజం స్థలం రూ. 25 వేల నుంచి రూ. 30 వేలు పలుకుతోంది. అలాగే రోడ్డుకు ఆనుకుని ఉన్న ఒక గజం స్థలం అయితే రూ. 80 వేల నుంచి 90 వేలు పలుకుతోంది. సినీ సెలబ్రిటీలైన అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబులకు కూడా శంకరపల్లిలో ల్యాండ్స్ ఉన్నాయి. ఇక శంకరపల్లి నుంచి కోకాపేటకు 20 కిమీల డబుల్ రోడ్ ఉంది.

ఇది చదవండి:  చేపల వల బరువెక్కడంతో జాలర్లు సంబరపడ్డారు.. తీరా పైకి లాగి చూడగా.!

ఇవి కూడా చదవండి

అటు మోకిలాలో ఇప్పటికే లగ్జరీ విల్లాస్, అపార్ట్‌మెంట్లు ఎన్నో ఉన్నాయి. కొత్తగా పోలీస్ స్టేషన్ వచ్చింది. అలాగే పలు ఎంటర్టైన్మెంట్ జోన్లను కూడా ఏర్పాటు చేయనున్నారు అధికారులు. అటు పిల్లలకు ఇంటర్నేషనల్ స్కూల్స్, ప్రీ-స్కూల్స్ మోకిలాలో వచ్చాయి. ఇక ఈ రెండు ప్రాంతాలు మెట్రో రాకతో మరింతగా దశ తిరుగుతాయి. ఇప్పుడున్న రూ. 30 వేల రేటు.. భవిష్యత్తులో రూ. 80 వేల నుంచి రూ. 90 వేలకు.. అలాగే రోడ్డుకి ఆనుకుని ఉన్న స్థలం రూ. లక్ష నుంచి లక్షన్నర వరకు పలకవచ్చునని బిజినెస్ నిపుణులు అంటున్నారు.

ఇది చదవండి: వర్షాకాలంలో పాములు ఇంట్లోకి వస్తున్నాయా.? ఈ వంటింటి చిట్కాలతో ఈజీగా తరిమేయండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..