MLC Kavitha Interview: కవిత జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారా.? టీవీ9 స్పెషల్‌ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు..

|

Mar 03, 2023 | 8:30 PM

MLC Kavitha Interview with Rajinikanth Live Updates: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ వ్యవహారం తెరపైకి వచ్చిన తర్వాత బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత పేరు ఒక్కసారిగా మారుమోగింది. కవిత అరెస్ట్‌ ఖాయమని ఓవైపు బీజేపీ నేతలు బహిరంగానే ఆరోపిస్తున్నారు. అయితే ఇవేవి పట్టించుకోని కవిత మాత్రం తనదైన శైలిలో...

MLC Kavitha Interview: కవిత జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారా.? టీవీ9 స్పెషల్‌ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు..

MLC Kavitha Interview with Rajinikanth: లిక్కర్‌ స్కామ్‌ తర్వాత ఒక్కసారిగా తెరపైకి వచ్చిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత టీవీ9 ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. లిక్కర్‌ స్కామ్‌ నుంచి తప్పించుకోవడానికే కవిత మహిళా రిజర్వేషన్‌ అంశం తెరపైకి తెచ్చారా అన్న ప్రన్నకు కవిత బదులిస్తూ..’అసలు స్కామ్‌ జరిగిందో లేదో అనే విషయమే వారిక తెలియదు. బీజేపీ వాల్ల మొదటి టార్గెట్‌ కేసీఆర్‌ గారు. ఆయనను టార్గెట్ చేయడానికి నన్ను టార్గెట్‌ చేశారు. మా కుటుంబలో మొదటగా నన్ను టార్గెట్ చేశారు. ఆ తర్వాత పార్టీలో అందరిని బెదిరించాలని చూస్తున్నారు. ఏజెన్సీలను ఉపయోగించి అందరినీ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు’ అని కవిత చెప్పుకొచ్చారు.

జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారా అన్న ప్రశ్నకు.. ‘ఈడీ మొదట వస్తుంది తర్వాత మోదీ వస్తాడన్న విషయం అందరికీ అర్థమైంది. వాళ్ల చేతిలో ఉన్న పవర్‌తో కొంతకాలం పాటు జైల్లో పెడితే రాజకీయ ప్రయోజం వస్తుందని అనుకుంటే… అధికారంలో ఉన్న వాళ్లు చేయలేనిది ఏముంటుంది. నేను ఏజెన్సీలకు సపోర్ట్‌ చేస్తున్నాను. నాపై చేసిన ఆరోపణల్నింటికీ సీబీఐ ముందు సమాధానం చెప్పగలను. నా స్నేహితులు ఏ వ్యాపారం చేస్తారనే విషయం నాకు సంబంధం లేదు. బీజేపీ సోషల్‌ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేస్తోంది’ అని కవిత చెప్పుకొచ్చారు.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 03 Mar 2023 08:27 PM (IST)

    కేసీఆర్‌ కుటంబమే బలహీనతగా మారితే..

    రానున్న ఎన్నికల్లో కేసీఆర్‌ కుటుంబం బలహీనతగా మారితే ఎలా అన్న ప్రశ్నకు కవిత బదులిస్తూ..’ఎట్టి పరిస్థితుల్లో బలహీనత కాదు. మా కుటుంబం ప్రజల కోసం పనిచేసే కుటుంబం. తప్పకుండా కేసీఆర్‌ గారికి బలంగా ఉంటాం. వచ్చే ఎన్నికల్లో సెంచరీ కొట్టాలనే టార్గెట్‌తో ఉన్నాము’ అని ఆశాభావం వ్యక్తం చేశారు.

  • 03 Mar 2023 08:19 PM (IST)

    వ్యక్తిగతంగా తమిళసై ఎందుకు టార్గెట్‌ చేస్తున్నారు.?

    గవర్నర్‌ తమిళసైని బీఆఆర్‌ఎస్‌ ఎందుకు టార్గెట్‌ చేస్తుందన్న ప్రశ్నకు కవిత బదులిస్తూ.. ‘బీజేపీ ఢిల్లీ నుంచి గవర్నర్‌లను రిమోట్‌తో ఆపరేట్‌ చేస్తూ ప్రతీ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రులను ఇబ్బంది పెడుతోంది. తెలంగాణలో గవర్నర్‌ ప్రవర్తన కావొచ్చు, పెండింగ్‌లో ఉన్న బిల్లులు ఢిల్లీ వాళ్లు ఆడిస్తున్న ఆట. ఇందులో వ్యక్తిగతంగా తమిళసై గారిపై అన్న చర్చ రాదు. గవర్నర్‌ న్యూట్రల్‌గా ఉండాలి. గవర్నర్‌ చేయాల్సిన పనులు చేయకుండా, సమస్యను పక్కదారి పట్టిస్తున్నారు. బిల్లులను నొక్కిపెట్టడానికి గవర్నర్‌కు హక్కు ఎక్కడిది.? దేశంలో గవర్నర్‌ వ్యవస్థ రాజ్యాంగ వ్యతిరేక శక్తిగా పనిచేస్తుంది’ అని కవిత చెప్పుకొచ్చారు.


  • 03 Mar 2023 08:05 PM (IST)

    అరవింద్‌ చేతిలో ఓటమికి కారణం ఏంటి.?

    నిజమాబాద్‌లో అరవింద్‌ చేతిలో ఓడిపోవడానికి కారణం ఏంటి అన్న ప్రశ్నకు కవిత బదులిస్తూ.. ‘ఎవరైనా ఓటమిని పక్కవారిపై నెట్టేయడానికి చూస్తారు. కానీ నేను మాత్రం నా ఓటమికి నేనే కారణమని చెబుతాను. నేను ఎవరినీ నిందించను. కానీ నాపై 185 మంది అభ్యర్థులను నిలబెట్టి, 24 ఈవీఎంలు పెట్టారు. నేను టెక్నికల్‌గా ఓడిపోయాను తప్ప ఇది కేసీఆర్‌ గారి పరాజయం కాదు, బీఆర్‌ఎస్‌ పరాజయం కాదు. 185 మంది అభ్యర్థులను నెలబెట్టి వేసిన స్కెచ్‌లో బీజేపీ సక్సెస్‌ అయ్యింది’ అని కవిత చెప్పుకొచ్చారు.

  • 03 Mar 2023 08:00 PM (IST)

    తెలంగాణ వచ్చాక నాయకుల ఆస్తులు పెరిగాయా.?

    తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకుల ఆస్తులు పెరిగియన్న ఆరోపణలపై కవిత బదులిస్తూ.. ‘నాయకుల దగ్గర ఉన్న డబ్బు దాచుకుంటే దాగదు. పొలిటికల్‌ కరప్షన్‌ తెలంగాణ లేదు కాబట్టే తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి చాలా మంది వస్తున్నారు. అవినీతి లేకుండా ఉంటేనే రాష్ట్రం బాగుపడుతుందని కేసీఆర్‌ గారు ముందుకు సాగుతున్నారు. అందుకే రాష్ట్ర బడ్జెట్‌ భారీగా పెరిగింది. పొలిటికల్‌ లీడర్స్‌ కాదు, తెలంగాణ ప్రజలు ధనవంతులు అయ్యారు. తెలంగాణ వ్యాప్తంగా భూముల ధరలు భారీగా పెరిగాయి. నాకు వచ్చిన డబ్బంతా న్యాయపరంగా సంపాదించినదే’అని కవిత చెప్పుకొచ్చారు.

  • 03 Mar 2023 07:47 PM (IST)

    కవితకు కుటుంబం నుంచి సపోర్ట్‌ లభించడం లేదా..

    లిక్కర్‌ స్కామ్‌లో ఇరుకున్న కవితకు ఆమె కుటంబం నుంచి మద్ధతు లభించడం లేదా అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘మా నాన్న ఇంట్లోనే నాకు నాన్న. కానీ ఆయన పార్టీ అధ్యక్షుడు, రాష్ట్రానికి ముఖ్యమంత్రి.. నాపై ఒక సిల్లీ ఆరోపణ చేస్తే, దానిపై ముఖ్యమంత్రికి స్పందించాల్సిన అవసరం లేదు. ఇంట్లో నైతికంగా నా కుటుంబం నాతో ఉంది. నా స్నేహితులు నాకు మద్ధతుగా ఉన్నారు. పార్టీ ఎలా రియాక్ట్‌ అవుతుందో అలా రియాక్ట్‌ అవుతుంది’ అని కవిత బదులిచ్చారు.

  • 03 Mar 2023 07:40 PM (IST)

    ఆధారాలు ఉంటే అరెస్ట్ చేయొచ్చు..

    లిక్కర్‌ స్కామ్‌కు సంబంధించి ఆధారాలు ఉంటే అరెస్ట్‌ చేయాలని బీజేపీకి కవిత సవాల్ విసిరారు. తప్పు చేయనప్పుడు తనకు ఎందుకు భయం అని ప్రశ్నించారు. ఈ విషయమై కవిత ఇంకా మాట్లాడుతూ.. ‘తెలంగాణలో ఎన్నికలు వస్తున్న సమయంలో నా పేరును తీసుకొచ్చారు. లిక్కర్‌ స్కామ్‌లో నిజం లేదు. కేవలం పబ్లిసిటీ కోసం వాడుకుంటున్నారు. బీజేపీ ఎన్నికల కోసం ఎంత నీచమైన స్థాయికైనా దిగజారుతోందని తేలి పోయింది. నేను ఏంటో ప్రజలకు తెలుసు. బీజేపీ టార్గెట్ చేస్తుంది నన్ను కాదు, కేసీఆర్‌ గారి కోసం’ అని కవిత చెప్పుకొచ్చారు.

  • 03 Mar 2023 07:33 PM (IST)

    కవిత జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారా.?

    కవిత జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారా ప్రశ్నకు కవిత బదులిస్తూ.. ‘ఈడీ మొదట వస్తుంది తర్వాత మోదీ వస్తాడన్న విషయం అందరికీ అర్థమైంది. వాళ్ల చేతిలో ఉన్న పవర్‌తో కొంతకాలం పాటు జైల్లో పెడితే రాజకీయ ప్రయోజం వస్తుందని అనుకుంటే… అధికారంలో ఉన్న వాళ్లు చేయలేనిది ఏముంటుంది. నేను ఏజెన్సీలకు సపోర్ట్‌ చేస్తున్నాను. నాపై చేసిన ఆరోపణల్నింటికీ సీబీఐ ముందు సమాధానం చెప్పగలను. నా స్నేహితులు ఏ వ్యాపారం చేస్తారనే విషయం నాకు సంబంధం లేదు. బీజేపీ సోషల్‌ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేస్తోంది’ అని కవిత చెప్పుకొచ్చారు.

  • 03 Mar 2023 07:23 PM (IST)

    లిక్కర్‌ స్కామ్‌ నుంచి తప్పించుకోవడానికేనా.?

    లిక్కర్‌ స్కామ్‌ నుంచి తప్పించుకోవడానికే కవిత మహిళా రిజర్వేషన్‌ అంశం తెరపైకి తెచ్చారా అన్న ప్రన్నకు కవిత బదులిస్తూ..’అసలు స్కామ్‌ జరిగిందో లేదో అనే విషయమే వారిక తెలియదు. బీజేపీ వాల్ల మొదటి టార్గెట్‌ కేసీఆర్‌ గారు. ఆయనను టార్గెట్ చేయడానికి నన్ను టార్గెట్‌ చేశారు. మా కుటుంబలో మొదటగా నన్ను టార్గెట్ చేశారు. ఆ తర్వాత పార్టీలో అందరిని బెదిరించాలని చూస్తున్నారు. ఏజెన్సీలను ఉపయోగించి అందరినీ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు’ అని కవిత చెప్పుకొచ్చారు.

  • 03 Mar 2023 07:13 PM (IST)

    రాజకీయాల్లో ఓపిక ఉండాలి..

    మహిళ కానీ, పురుషులు కానీ రాజకీయాల్లో ఓపిక ఉండాలని కవిత చెప్పుకొచ్చారు. పార్టీలో అవకాశాలు రాలేదని గోల చేస్తానంటే అది వ్యక్తిగత కెరీర్‌కు దెబ్బ అవుతుంది. పార్టీకి, వ్యక్తిగతంగా ఇబ్బందులు వస్తాయన్నారు. తనకు చాలా ఓపిక ఉందన్న కవిత.. అవకాశాలు వచ్చే వరకు వేచి చూస్తానని చెప్పుకొచ్చారు. బీఆర్‌ఎస్‌ పార్టీలో నాపై ఎలాంటి వివక్షత లేదని కవిత స్పష్టం చేశారు. 2019లో ఓడిపోతే నాకు ఎమ్మెల్సీగా పార్టీనే అవకాశం ఇచ్చిందన్నారు.

  • 03 Mar 2023 07:07 PM (IST)

    ఉన్నపలంగా మహిళా రిజర్వేషన్‌ ఎందుకు గుర్తొచ్చింది..

    ఉన్నపలంగా మహిళా రిజర్వేషన్‌ ఎందుకు గుర్తొచ్చిందన్న ప్రశ్నకు కవిత బదులిస్తూ.. ‘9 ఏళ్లుగా ప్రతీ మహిళా దినోత్సవం సందర్భంగా బిల్లు పెట్టమని కేంద్రాన్ని అడుగుతున్నాం. మహిళా బిల్లు పాస్‌ చేస్తే వేలాది మందికి ఉపయోగపడుతుందని ఈ సమస్యను టేకప్‌ చేశాము. చట్టం చేస్తే మహిళలకు న్యాయం జరుగుతుందని కవిత అభిప్రాయపడ్డారు. మా ఎజెండాలో ఎప్పటి నుంచో మహిళా బిల్లు డిమాండ్‌ ఉందని కవిత చెప్పుకొచ్చారు.

  • 03 Mar 2023 06:51 PM (IST)

    ఇంటర్వ్యూలో కవిత ఏం చెప్పనున్నారు..

    ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో తన పేరు ప్రముఖంగా వినపడుతుండంపై కవిత ఏం చెప్పనున్నారన్న ప్రశ్న అందరిలోనూ నెలకొంది. అలాగే కేటీఆర్‌ వారసత్వంపైనా ఆమె కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.

Follow us on