Ponguleti Srinivas Reddy: వారికి మాత్రమే ఇందిరమ్మ ఇళ్లు.. తప్పు జరిగిందని తెలిస్తే …

రాష్ట్రంలో ఇళ్లు లేని నిజమైప నిరుపేదలకు ఇళ్లు కట్టించే లక్ష్యంతోనే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నిజమైన అర్హులకు మాత్రమే ఈ పథకం వర్తించాలని అధికారులకు తెలిపారు. ఇళ్ల కేటాయింపులో ఎక్కడ తప్పు జరగకుండా చూసే బాధ్యత ఇంజనీర్లదేనని మంత్రి అన్నారు.

Ponguleti Srinivas Reddy: వారికి మాత్రమే ఇందిరమ్మ ఇళ్లు.. తప్పు జరిగిందని తెలిస్తే ...
Ponguleti Srinivas Reddy

Updated on: May 03, 2025 | 3:36 PM

రాష్ట్రంలో ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్లు కట్టించాలనే లక్ష్యంతోనే తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అయితే నిజమైన అర్హులకు మాత్రమే ఈ పథకం వర్తించాలని అధికారులను మంత్రి పొంగులేటి సూచించారు. ఇందులో ఎక్కడా తప్పు జరగకుండా చూసే బాధ్యత ఇంజనీర్లదేనని మంత్రి అన్నారు. న్యాక్‌లో శిక్షణ పూర్తి చేసుకొని రిజిస్ట్రేషన్ల శాఖలో పదోన్నతి పొందిన వారికి ఆర్డర్‌ కాపీలు అందజేసి సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.

న్యాక్‌లో శిక్షణ పూర్తి చేసుకున్న 390 మంది అసిస్టెంట్‌ ఇంజనీర్లు రిజిస్ట్రేషన్ల శాఖలో పదోన్నతలు పొందారు. ఈ సందర్భంగా
న్యాక్ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి తెలంగాణ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. న్యాక్‌లో శిక్షణ పూర్తి చేసుకొని రిజిస్ట్రేషన్ల శాఖలో పదోన్నతల పొందిన వారికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆర్డర్ కాపీలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ శాఖలో పదోన్నతి పొందిన ఇంజనీర్లు గృహ నిర్మాణ శాఖకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. తప్పు జరిగిందని తెలిస్తే చర్యలు తీసుకుంటాం అన్నారు.

ఇక ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు విషయంలో అధికారులు బాధ్యతతో పనిచేయాలన్నారు. నిజమైన నిరుపేదలు, లబ్ధిదారులకు మాత్రమే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలన్నారు. ఇళ్ల కేటాయింపుయ విషయంలో ఎక్కడా, ఎలాంటి తప్పు జరగకుండా చూసుకునే బాధ్యత ఇంజనీర్లదేనని ఆయన తెలిపారు. తప్పు జరిగిందని తెలిస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ మేరకు ఒక టోల్‌ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి తెలిపారు. ఎక్కడైనా తప్పు జరిగితే ఆ టోల్‌ ఫ్రీ నెంబర్‌కు కాల్‌ చేయాలని మంత్రి సూచించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..