KTR: వారెవ్వా.. ఈయనండి లీడర్ అంటే.. తన కారుకు చలాన్ వేసిన ఎస్ఐకి కేటీఆర్ సన్మానం

|

Oct 04, 2021 | 4:41 PM

కొందరు పొలిటికల్ లీడర్స్ తాము చట్టానికి, నిబంధనలకు అతీతులం అన్నట్లు ఫీలవుతుంటారు. తాము తప్పు చేసినా చెల్లుతుంది అన్నట్లు ప్రవర్తిస్తారు.

KTR: వారెవ్వా.. ఈయనండి లీడర్ అంటే.. తన కారుకు చలాన్ వేసిన ఎస్ఐకి కేటీఆర్ సన్మానం
Ktr
Follow us on

కొందరు పొలిటికల్ లీడర్స్ తాము చట్టానికి, నిబంధనలకు అతీతులం అన్నట్లు ఫీలవుతుంటారు. తాము తప్పు చేసినా చెల్లుతుంది అన్నట్లు ప్రవర్తిస్తారు. ముఖ్యంగా రోడ్లపై ప్రయాణించే సమయంలో ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించి కూడా పోలీసులదే తప్పనట్లుగా కొందరు లీడర్స్ వ్యవహరిస్తారు. ఎవరైనా పోలీసులు ధైర్యం చేసి ఫైన్ వేస్తే వారిని తమ పవర్ ఉపయోగించి ట్రాన్స్‌ఫర్ చేయించడమో, సస్పెండ్ చేయడమే చేస్తుంటారు. అయితే తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మాత్రం ఇందుకు పూర్తి విరుద్దం. ఆయన ఎప్పుడూ అధికారులతో ఫ్రెండ్లీగానే ఉంటారు. తాజాగా మరోసారి తమ మంచి మనసు చాటుకున్నారు.

సామాన్య ప్రజలు అయినా అధికారంలో ఉన్న ప్రజా ప్రతినిధులైనా.. నిబంధనలు అందరికీ ఒకటే అని చాటి చెప్పారు మంత్రి కేటీఆర్. రెండు రోజుల కింద తన వాహనానికి ట్రాఫిక్ చలాన్ విధించిన ట్రాఫిక్ ఎస్ఐ ఐలయ్యను మంత్రి కేటీఆర్ అభినందించారు. బాపు ఘాట్ లో నిర్వహించిన గాంధీ జయంతి కార్యక్రమం సందర్భంగా అనుకోని పరిస్థితుల్లో రాంగ్ రూట్ లో వచ్చిన తన వాహనానికి నిబంధనల ప్రకారం చలాన్ విధించిన ఎస్ఐ ఐలయ్య, కానిస్టేబుల్ వెంకటేశ్వర్లుకు శాలువా కప్పి అభినందించారు మంత్రి. రాంగ్ రూట్ లో వచ్చిన మంత్రి వాహనానికి.. నిబంధనల ప్రకారం చలాన్ విధించిన ట్రాఫిక్ సిబ్బందిని తన కార్యాలయానికి పిలిపించుకుని మరీ అభినందనలు తెలిపారు కేటీఆర్. ట్రాఫిక్ నిబంధనలు పాటించడంలో తాను ఎల్లవేళలా ముందు ఉంటానని, చలాన్ విధించిన రోజు సైతం వాహనంలో తాను లేనని అన్నారు కేటీఆర్. అయితే విధి నిర్వహణలో నిజాయితీగా వ్యవహరించే ఐలయ్య లాంటి అధికారులకి ఎప్పుడూ తాము అండగా ఉంటామన్నారు కేటీఆర్.

Also Read: ఈ వారం థియేటర్స్, ఓటీటీలలో రిలీజ్ అవ్వబోతున్న సినిమాలు ఇవే.. పూర్తి వివరాలు

 “మా” ఎన్నికలపై ఏపీ సర్కార్‌ కీలక ప్రకటన.. తేల్చేశారు