Minister Kishan Reddy: తెలంగాణ విమోచన రాజకీయం హాట్‌హాట్‌గా మారింది. ఆ పార్టీ.. ఈ పార్టీ అని కాదు.. అన్ని రాజకీయ పార్టీలూ ఉత్సవాలపై వ్యూహాత్మక అడుగులు వేస్తున్నాయి. దీంట్లో భాగంగానే ఇవాళ బీజేపీ చేపట్టిన ర్యాలీ ఉత్సాహంగా సాగింది. అధికారికంగా తెలంగాణ విమోచన ఉత్సవాలు నిర్వహిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. అందుకు ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. విమోచన ఉత్సవాల్లో భాగంగా బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఆరెంజ్ బ్రిగేడ్ బైక్ ర్యాలీ నిర్వహిస్తోంది. భాగ్యలక్ష్మీ ఆలయంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రత్యేక పూజలు చేసి ర్యాలీలో పాల్గొన్నారు. ఇక చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయం నుంచి పరేడ్ గ్రౌండ్స్ మీదుగా సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. జాతీయ జెండాల రెపరెపల మధ్య, కాషాయ తలపాగాలు ధరించిన బీజేపీ మహిళా కార్యకర్తలంతా ర్యాలీలో పాల్గొన్నారు.
చార్మినార్ నుంచి పరేడ్ గ్రౌండ్ వరకూ బౌక్‌లు దౌడు తీశాయి. సెప్టెంబర్ 17 సందర్భంగా హైదరాబాద్‌లో ఎక్కడా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు సెక్యూరిటీ టైట్ చేశారు. సెప్టెంబర్ 17ను తెలంగాణ సర్కార్ జాతీయ సమైక్యత దినోత్సవంగా జరుపుతోంది.
అటు.. సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా BJP జరుపుతోంది. ఈ పోటా పోటీ కార్యక్రమాలతో ఎక్కడా ఉద్రిక్తత నెలకొనకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సెప్టెంబర్ 17న పరేడ్‌గ్రౌండ్‌లో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. సభకు ముఖ్య అతిథిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వస్తున్నారు. అదే రోజున ఎన్టీఆర్ గ్రౌండ్స్‌లో రాష్ట్ర ప్రభుత్వం సభ నిర్వహిస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం