Indian Railway: ఒకే ట్రాక్‌పై ఎదురెదురుగా రెండు రైళ్లు.. రైల్లో రైల్వే మంత్రి, బోర్డు ఛైర్మన్‌.. అసలు విషయానికొస్తే..

|

Mar 04, 2022 | 1:40 PM

Indian Railway: దక్షణ మధ్య రైల్వే (South Central Railway) అధికారులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఒకే ట్రాక్‌పై రెండు రైళ్లు (Trains) ఎదురెదురుగా వస్తే ప్రమాదాన్ని..

Indian Railway: ఒకే ట్రాక్‌పై ఎదురెదురుగా రెండు రైళ్లు.. రైల్లో రైల్వే మంత్రి, బోర్డు ఛైర్మన్‌.. అసలు విషయానికొస్తే..
Follow us on

Indian Railway: దక్షణ మధ్య రైల్వే (South Central Railway) అధికారులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఒకే ట్రాక్‌పై రెండు రైళ్లు (Trains) ఎదురెదురుగా వస్తే ప్రమాదాన్ని ఎలా నివారించాలన్నదానిపై ఈ రోజు ప్రయోగాత్మకంగా పరిశీలించారు. అధికారులు. దీంతో శుక్రవారం సికింద్రాబాద్‌ డివిజన్‌ (Secunderabad Division) లోని లింగంపల్లి-వికారాబాద్‌ సెక్షన్‌లో ఒకే ట్రాక్‌ (Track)పై రెండు రైళ్లు ఎదురెదురుగా వస్తే ప్రమాదాన్ని ఎలా నివారించాలనేదానిపై టెస్ట్ రైడ్ నిర్వహించారు. ఈ ప్రయోగంలో  ఒక రైల్లో రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌, మరో రైల్లో రైల్వే బోర్డు ఛైర్మన్‌, సీఈవో వినయ్‌ కుమార్‌ త్రిపాఠి  పాల్గొన్నారు. ఈ ప్రయోగం ద్వారా  ఒకే ట్రాక్ పై వచ్చే రెండు రైళ్లు అత్యంత దగ్గరగా వచ్చి ఆగిపోనున్నాయి. రైళ్లకు ఆటోమెటిక్‌ బ్రేకులు పడి ఇలా పూర్తిగా ఆగిపోయినప్పుడు రెండింటి మధ్య సుమారు 200 మీటర్ల దూరం ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు పేర్కొంటున్నారు. దక్షిణ మధ్య రైల్వే జోన్‌ పరిధిలో కీలకమైన సికింద్రాబాద్‌- వాడి- ముంబై మార్గంలో కవచ్‌ను అమల్లోకి తేనుంది. అందులో భాగంగా లింగంపల్లి – వికారాబాద్‌ సెక‌్షన్‌ను కవచ్‌ పరిధిలోకి తీసుకువచ్చారు.

అయితే రెండు రైళ్లు ఒకే ట్రాక్‌పై వచ్చినప్పుడు ఆపేందుకు ఎలాంటి ప్రయత్నాలు జరగవు. అయితే సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన రైలు రక్షణ వ్యవస్థ ‘కవచ్‌’ ఆ రైళ్లను గుర్తించి ప్రమాదం జరుగకుండా ఆపగలుగుతుంది. గతంలో సాంకేతిక సిబ్బంది తనిఖీలు నిర్వహించి ఈ టెక్నాలజీ విజయవంతంగా పని చేస్తున్నట్లు నిర్ధారించారు. ఇప్పుడు తాజాగా రైల్వేశాఖ మంత్రి, బోర్డు ఛైర్మన్‌ ఈ ప్రయోగంలో పాల్గొనడం విశేషం.

కవచ్‌ అంటే ఏమిటి..?

రెడ్‌ సిగ్నల్‌ పడినప్పుడు లోకో పైలట్‌ పట్టించుకోకండా ఆ రైలును అలాగే తీసుకెళ్లినట్లయితే ఈ కవచ్‌ అనే వ్యవస్థ గుర్తించి ఆటమేటిక్‌గా బ్రేకులు వేస్తుంది. ట్రాక్‌ బాగా లేనప్పుడు, ఇతర సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు, అలాగే రెండు రైళ్లు ఎదురెదురుగా వచ్చినప్పుడు గుర్తించి రైళ్లను ఆపేలా చేస్తుంది. అంతేకాకుండా వంతెనలు, మలుపుల ఉన్న ప్రాంతాల్లో కూడా రైలు వేగాన్ని తగ్గించేలా చేస్తుంది. ఇప్పుడు ఈ కవచ్‌ వ్యవస్థను ప్రయోగాత్మకంగా చేపట్టనున్నారు.

 

ఇవి కూడా చదవండి:

Moon Surface: చంద్రుడికి ముప్పు.. ఉపరితలాన్ని ఢీకొట్టనున్న 3 టన్నుల వ్యర్థాలు..!

Sleeping: వయసు పెరిగే కొద్దీ నిద్రలేమి సమస్య ఎందుకు వస్తుంది? పరిశోధనలలో కీలక విషయాలు