ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో గుడ్‌ న్యూస్

| Edited By: Pardhasaradhi Peri

Dec 15, 2019 | 10:32 AM

ప్రయాణికులకు హైదరాబాద్‌ మెట్రో గుడ్ న్యూస్ ప్రకటించింది. రాత్రి పూట చివరి సర్వీస్‌ను కొనసాగిస్తూ మెట్రో అధికారులు నిర్ణయం తీసుకున్నారు. చివరి సర్వీస్‌ను రాత్రి 11 గంటలకు బయలుదేరి గం.11.50ని.లకు ఆఖరి స్టాప్ వద్ద ఆగనుందని మైట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి పేర్కొన్నారు. అలాగే ఉదయం సర్వీసులు ఇదివరకు 6గంటల నుంచి ప్రారంభం కానుండగా.. ఇప్పుడు గం.6.30ని.లకు మొదలుకానుందని ఆయన వెల్లడించారు. ఈ మార్పులను ప్రయాణికులు గమనించాలని ఎన్వీఎస్ రెడ్డి కోరారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె తరువాత […]

ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో గుడ్‌ న్యూస్
Follow us on

ప్రయాణికులకు హైదరాబాద్‌ మెట్రో గుడ్ న్యూస్ ప్రకటించింది. రాత్రి పూట చివరి సర్వీస్‌ను కొనసాగిస్తూ మెట్రో అధికారులు నిర్ణయం తీసుకున్నారు. చివరి సర్వీస్‌ను రాత్రి 11 గంటలకు బయలుదేరి గం.11.50ని.లకు ఆఖరి స్టాప్ వద్ద ఆగనుందని మైట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి పేర్కొన్నారు. అలాగే ఉదయం సర్వీసులు ఇదివరకు 6గంటల నుంచి ప్రారంభం కానుండగా.. ఇప్పుడు గం.6.30ని.లకు మొదలుకానుందని ఆయన వెల్లడించారు. ఈ మార్పులను ప్రయాణికులు గమనించాలని ఎన్వీఎస్ రెడ్డి కోరారు.

ఆర్టీసీ కార్మికుల సమ్మె తరువాత నష్టాలను తగ్గించడంపై కార్పొరేషన్ దృష్టి పెట్టింది. నష్టాలొచ్చే రూట్లలో బస్సులను నడపకపోవడమే మంచిదని అధికారులు సీఎం కేసీఆర్‌కు వెల్లడించారు. దీనికి ఆయన అంగీకారం తెలిపారు. ఈ నేపథ్యంలో నగరంలోనే దాదాపు వెయ్యి సిటీ బస్సులను రద్దు చేసినట్లు తెలిసింది. ఇక ప్రయాణికులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశ్యంతో మెట్రో రైలు సేవలను విస్తృతం చేయనున్నట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. అయితే ఇటీవల ఆర్టీసీ సమ్మె సమయంలో కూడా రాత్రి 11గంటల వరకు మెట్రో చివరి సర్వీస్‌ నడిచిన విషయం తెలిసిందే.