మెట్రో ప్రయాణికులకు తీపి కబురు

హైదరాబాద్ : నగర వాసులకు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ఉగాది కానుకను ప్రకటించింది. మెట్రో స్మార్ట్ కార్డు ధరను యాభై శాతానికి తగ్గించింది. ప్రస్తుతం రూ.150గా ఉన్న స్మార్ట్ కార్డ్ ధరను రూ.75కు తగ్గించింది. మరో మూడు నెలల వరకూ రూ. 75తోనే మెట్రో కార్డులను కొనుగోలు చేయవచ్చని తెలిపింది. ఇందులో రూ. 25 కార్డు ఖర్చుని, మిగతా రూ. 50 లను ప్రయాణానికి వినియోగించుకోవచ్చని పేర్కొంది. ఆపై రూ. 50 నుంచి రూ. 3 […]

మెట్రో ప్రయాణికులకు తీపి కబురు

Updated on: Apr 04, 2019 | 6:16 PM

హైదరాబాద్ : నగర వాసులకు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ఉగాది కానుకను ప్రకటించింది. మెట్రో స్మార్ట్ కార్డు ధరను యాభై శాతానికి తగ్గించింది. ప్రస్తుతం రూ.150గా ఉన్న స్మార్ట్ కార్డ్ ధరను రూ.75కు తగ్గించింది. మరో మూడు నెలల వరకూ రూ. 75తోనే మెట్రో కార్డులను కొనుగోలు చేయవచ్చని తెలిపింది.

ఇందులో రూ. 25 కార్డు ఖర్చుని, మిగతా రూ. 50 లను ప్రయాణానికి వినియోగించుకోవచ్చని పేర్కొంది. ఆపై రూ. 50 నుంచి రూ. 3 వేల వరకూ రీచార్జ్ చేసుకోవడం ద్వారా ప్రయాణ అవసరాలను తీర్చుకోవచ్చని వెల్లడించింది. కాగా, ఇప్పటివరకూ సుమారు 6 లక్షల మంది మెట్రో కార్డులను వినియోగిస్తున్నారని పేర్కొంది.

Loading...
Unable to load recommendations.
Follow Us