హైదరాబాద్‌లో దశల వారీగా నడవనున్న మెట్రో.. వివరాలివే

కేంద్రం ఇచ్చిన సడలింపుల నేపథ్యంలో తెలంగాణలో ఈ నెల 7 నుంచి మెట్రో సర్వీసులు పునః ప్రారంభం కానున్నాయి.

హైదరాబాద్‌లో దశల వారీగా నడవనున్న మెట్రో.. వివరాలివే

Edited By:

Updated on: Sep 03, 2020 | 7:28 PM

Hyderabad Metro Services: కేంద్రం ఇచ్చిన సడలింపుల నేపథ్యంలో తెలంగాణలో ఈ నెల 7 నుంచి మెట్రో సర్వీసులు పునః ప్రారంభం కానున్నాయి. దీంతో దశల వారిగా మెట్రోను నడపాలని హైదరాబాద్ మెట్రో నిర్ణయించింది. ఈ క్రమంలో సర్వీసులను మూడు ఫేజ్‌లుగా విభజించారు. 7న మొదటి ఫేజ్‌లో భాగంగా మియపూర్ నుంచి ఎల్బీనగర్ వరకు మెట్రో ఓపెన్‌లో ఉండనుంది. అలాగే ఉదయం 7 గంటల నుండి 12 గంటల వరకు తిరిగి 4 గంటల నుంచి 9 గంటల వరకు మాత్రమే మెట్రోలు తిరగనున్నాయి. ఇక 8వ తేదీన సెకండ్ ఫేజ్‌లో భాగంగా నాగోల్ నుంచి రాయదుర్గం వరకు మెట్రో సర్వీసులు నడవనున్నాయి. 9వ తేదీన థర్డ్ ఫేజ్ అన్ని మార్గాల్లో మెట్రో సర్వీసులు నడవనున్నాయి. అయితే కంటైన్మెంట్ జోన్లలో మెట్రో క్లోజ్ అవ్వనుంది. ఆ లిస్ట్‌లో గాంధీ హాస్పిటల్, భరత్ నగర్, మూసాపేట్‌, ముషీరాబాద్, యూసుఫ్ గూడలో మెట్రో సర్వీసులు బంద్ కానున్నాయి.

Read More:

గుడ్‌న్యూస్‌.. ఏపీలో పెరుగుతున్న రికవరీ రేటు

కరోనా అప్‌డేట్స్‌: ఏపీలో 10,199 కొత్త కేసులు.. 75 మరణాలు