Hyderabad: చంపి శరీర భాగాలను బకెట్‌లో ఉడికించాడు..! మీర్‌పేట్‌ మాధవి హత్య కేసులో సంచలన విషయాలు

|

Jan 26, 2025 | 11:19 AM

మీర్‌పేట మర్డర్‌ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు వెలుగుచూస్తున్నాయి. నిందితుడు ఎవరో తెలుసు.. ఏం జరిగిందనే నిజం తెలుసు . కానీ నిజనిర్దారణ పోలీసులకు ఓ సవాల్‌గా మారింది.టెక్నికల్‌ ఎవిడెన్స్‌ కీలకంగా మారిన ఈ కేసులో FSL రిపోర్ట్‌ కోసం ఎదురు చూస్తున్నారు పోలీసులు.. అయితే.. తనపై అనుమానం ఉంటే ఆధారాలు చూపాలని పోలీసులతో వాదనకు దిగాడు గురుమూర్తి..

Hyderabad: చంపి శరీర భాగాలను బకెట్‌లో ఉడికించాడు..! మీర్‌పేట్‌ మాధవి హత్య కేసులో సంచలన విషయాలు
Crime News
Follow us on

హైదరాబాద్‌ మీర్‌పేట్‌ మాధవి మర్డర్‌ కేసులో సంచలనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. విచారణలో భాగంగా మాధవి పిల్లలు, తల్లి నుంచి శాంపిల్స్ సేకరించారు పోలీసులు. నిందితుడు గురుమూర్తిని ఆయన నివాసానికి తీసుకెళ్లిన పోలీసులు కీలక వివరాలను సేకరించారు.. వాష్‌రూమ్‌ దగ్గర పొడవాటి తల వెంట్రుకలు, వంటగదిలో కంటికి కనిపించకుండా ఉన్న రక్తపు మరకలను బ్లూ రేస్‌ టెక్నాలజీ ద్వారా గుర్తించారు. రక్తం తుడిచినట్టున్న టిష్యూ పేపర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. DNA మ్యాచింగ్‌ కోసం టిష్యూ, వెంట్రుకలు, రక్తపు మరకల శాంపిల్స్‌ను FSLకు పంపారు.

అయితే.. మీర్‌పేట్ మాధవి మర్డర్ కేసు తెలంగాణ పోలీసులకు సవాల్‌గా మారింది. ఆధారాలులేని మర్డర్ కేసులను స్టడీచేస్తున్నారు పోలీసులు. దేశంలో ఈ తరహాలో జరిగిన మర్డర్‌ కేసులు పరిశీలిస్తున్నారు. వివిధ రాష్ట్రాల్లో ఈ తరహా కేసులను గుర్తించి అక్కడి పోలీసుల సాయం తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రైవేట్ ఫోరెన్సిక్ ల్యాబ్‌లను కూడా సంప్రదించారు. బార్యను చంపిన హంతకుడు గురుమూర్తి పోలీసులు దొరకకుండా ఏం చేయాలో ఓపెద్ద రీసెర్చ్ చేసినట్లు స్పష్టమవుతోంది.

ఇన్నిరోజులు కుక్కర్లో భార్య శరీర భాగాలను ఉడకబెట్టారని అందరూ భావించారు. కానీ అతడు బకెట్‌లో శరీర భాగాలను ఉడికించినట్లు తేలింది. ప్రాధమికంగా గురుమూర్తే హంతకుడని పోలీసులు తేల్చినా… నిరూపించే ఆధారాల కోసం పోలీసుల వేట మొదలైంది. ఎఫ్‌ఎస్‌ఎల్‌ రిపోర్టు ఆధారంగానే మిస్సింగ్ కేసును మర్డర్ కేసుగా మార్చాల్సి ఉంటుంది.

ఇదిలాఉంటే.. తనపై అనుమానం ఉంటే ఆధారాలు చూపాలని, మీరెంత కొట్టినా ఎటువంటి ప్రయోజనం ఉండదంటూ పోలీసులతో వాదనకు దిగాడు గురుమూర్తి.. దీంతోపాటు హత్యకు ముందు తలెత్తిన గొడవలు, మృతదేహాన్ని మాయం చేసేందుకు చేసిన ప్రయత్నాలను పోలీసులకు వివరించినట్లు సమాచారం. ఇప్పటికే హత్య జరిగిన తీరుపై కొంత క్లారిటీకి వచ్చిన పోలీసులు.. పూర్తిగా టెక్నికల్‌ అంశాలతో ముడిపడి ఉండడంతో పొరుగు రాష్ట్రాల ఎక్స్‌పర్ట్స్ సాయంతో ఛేదించేందుకు ప్రయత్నిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..