సికింద్రాబాద్‌ సన్‌షైన్‌ ఆస్పత్రిలో దారుణం.. కోవిడ్‌తో వ్యక్తి మృతి.. 3 రోజులకు రూ.9 లక్షల బిల్లు.. కుటుంబీకుల ఆందోళన

| Edited By: Janardhan Veluru

May 29, 2021 | 11:20 AM

Coronavirus: కరోనా మహమ్మారి తెస్తున్న తంటాలు అన్నీ ఇన్నీ కావు. గత ఏడాదిగా కరోనా వెంటాడుతూ ప్రాణాలు తీస్తోంది. కోవిడ్‌తో ఎందరో మృత్యువాత పడుతున్నారు. ఇదే..

సికింద్రాబాద్‌ సన్‌షైన్‌ ఆస్పత్రిలో దారుణం.. కోవిడ్‌తో వ్యక్తి మృతి.. 3 రోజులకు రూ.9 లక్షల బిల్లు.. కుటుంబీకుల ఆందోళన
Follow us on

Coronavirus: కరోనా మహమ్మారి తెస్తున్న తంటాలు అన్నీ ఇన్నీ కావు. గత ఏడాదిగా కరోనా వెంటాడుతూ ప్రాణాలు తీస్తోంది. కోవిడ్‌తో ఎందరో మృత్యువాత పడుతున్నారు. ఇదే అదనుగా చేసుకుని ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు రోగుల నుంచి అధికంగా ఫీజులు వసూలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరిన పేషంట్లపై లక్షల్లో డబ్బులు వసూలు చేస్తుండటంతో ఆందోళన నెలకొంటోంది. రోగి మృతి చెందితే కొన్ని ప్రైవేటు ఆస్పతులు బిల్‌ పూర్తిగా పే చేస్తేనే మృతదేహాన్ని అప్పగిస్తామంటూ చెప్పడంతో బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు గురవుతున్నారు. తాజాగా సికింద్రాబాద్‌లోని సన్‌షైన్‌ ఆస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది. కోవిడ్‌తో సుభాష్‌ చంద్రబోస్‌ అనే పేషెంట్ మృతి చెందాడు. మూడు రోజులకు 9 లక్షల రూపాయలు బిల్లు వేసిన ఆస్పత్రి యాజమాన్యం.. ఆరు లక్షలు కట్టినప్పటికీ మరో 3.5 లక్షల రూపాయలు కడితేనే మృతదేహాన్ని అప్పగిస్తామంటూ ఆస్పత్రి యాజమాన్యం బెదిరింపులకు పాల్పడుతోందని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. దీంతో ఆస్పత్రి వద్ద కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న మీడియా సిబ్బంది ఆస్పత్రి వద్దకు చేరుకోగానే మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు ఇచ్చేశారు. అయితే ఇలా ప్రైవేటు ఆస్పత్రులు దోపిడీలకు పాల్పడుతున్నట్లు ప్రభుత్వానికి అందుతున్న ఫిర్యాదుల్లో సన్‌షైన్‌ ఆస్పత్రి పేరుంది.

ఇవీ కూడా చదవండి:

Boat Accident: ఆ పడవ ప్రమాదంలో 60 మంది మృతి.. 83 మంది వరకు గల్లంతు.. వెల్లడించిన అధికారులు

Black Fungus Cases: వణికిస్తున్న బ్లాక్‌ ఫంగస్‌.. ఆ రాష్ట్రంలో ఒకే రోజు 133 ఫంగస్‌ కేసులు.. 18 మంది మృతి..!