లాక్‌డౌన్ సడలింపులు.. ఐటీ ఉద్యోగుల లాగిన్, లాగ్ అవుట్ సమయాలివే..!

తెలంగాణలో కరోనా తగ్గుముఖం పడుతుండటానికి తోడు లాక్‌డౌన్ సడలింపులు ఇస్తోన్న నేపథ్యంలో ఐటీ కంపెనీలతో సైబరాబాద్ సీపీ సజ్జనార్ సమావేశం అయ్యారు.

లాక్‌డౌన్ సడలింపులు.. ఐటీ ఉద్యోగుల లాగిన్, లాగ్ అవుట్ సమయాలివే..!

Edited By:

Updated on: May 09, 2020 | 9:44 PM

తెలంగాణలో కరోనా తగ్గుముఖం పడుతుండటానికి తోడు లాక్‌డౌన్ సడలింపులు ఇస్తోన్న నేపథ్యంలో ఐటీ కంపెనీలతో సైబరాబాద్ సీపీ సజ్జనార్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఐటీ కంపెనీలకు ఆయన పలు సూచనలు చేశారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు ఐటీ కంపెనీల్లో కేవలం 33% ఉద్యోగులకు అనుమతిని ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. ఉద్యోగులు ఉదయం 7, 10 గంటల్లో లాగిన్ అయ్యి.. సాయంత్రం 3, 6గంటల సమయంలో లాగ్‌ అవుట్ అవ్వాలని ఆయన అన్నారు. కంపెనీ అధికారిక లెటర్‌ను ప్రతీ ఉద్యోగీ వెంట ఉంచుకోవాలని.. రాత్రి పూట కర్ఫ్యూ టైంలో కంపెనీ కార్యకలాపాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. కంపెనీ‌ బస్సులలో సైతం సోషల్ డిస్టేన్స్ ఉండాలని.. ప్రతి కంపెనీలో సానిటైజేషన్, ఉద్యోగులకు మాస్క్‌లు ఉండాలని ఆయన సూచించారు. అలాగే ఐటీ కంపెనీల బైట గుంపులుగా ఉద్యోగులు ఉండకూడదని..కంపెనీలో క్యాంటీన్‌లకు అనుమతి లేదని స్పష్టం చేశారు.

Read This Story Also: కరోనా లాక్‌డౌన్‌: ఏపీలో మరిన్ని మినహాయింపులకు కసరత్తులు