క్యాన్సర్ బాధితురాలికి కేటీఆర్ సాయం

| Edited By: Srinu

Nov 29, 2019 | 3:31 PM

ప్రజా సమస్యలను పరిష్కరించడంలో మంత్రి కేటీఆర్ ఎప్పుడూ ముందే ఉంటారు. అందుకు ప్రజా సమస్యలను నేరుగా తనకు తెలిపేందుకు ఆయన ట్విట్టర్ ఖాతాను బహిరంగ పరిచారు. ఇప్పటికే ట్విట్టర్ ద్వారా తనకు చేరిన అనేక సమస్యలను మంత్రి కేటీఆర్ పరిష్కరించారు. ఎంతోమందికి ఎన్నోరకాలుగా చేయూతనందించారు. తాజాగా ఒక క్యాన్సర్ పేషేంట్ కు మంత్రి కేటీఆర్ ఆపన్న హస్తం అందించేందుకు ముందుకు వచ్చారు.. హైదరాబాద్ కు చెందిన పళని ప్రగడ అనే యువకుడు తన ఇంటి పక్కన నివాసం […]

క్యాన్సర్ బాధితురాలికి కేటీఆర్ సాయం
Follow us on

ప్రజా సమస్యలను పరిష్కరించడంలో మంత్రి కేటీఆర్ ఎప్పుడూ ముందే ఉంటారు. అందుకు ప్రజా సమస్యలను నేరుగా తనకు తెలిపేందుకు ఆయన ట్విట్టర్ ఖాతాను బహిరంగ పరిచారు. ఇప్పటికే ట్విట్టర్ ద్వారా తనకు చేరిన అనేక సమస్యలను మంత్రి కేటీఆర్ పరిష్కరించారు. ఎంతోమందికి ఎన్నోరకాలుగా చేయూతనందించారు. తాజాగా ఒక క్యాన్సర్ పేషేంట్ కు మంత్రి కేటీఆర్ ఆపన్న హస్తం అందించేందుకు ముందుకు వచ్చారు.. హైదరాబాద్ కు చెందిన పళని ప్రగడ అనే యువకుడు తన ఇంటి పక్కన నివాసం ఉంటున్న 19 ఏళ్ల యువతికి ఎ ఎం ఎల్ ఎం 2 బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతోందని, ప్రస్తుతం ఆమె ఒమెగా ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని కేటీఆర్ కు ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. బాధితురాలు రోజు వారి కూలీ పనిచేసుకుని జీవిస్తున్నదని, వైద్యం చేయించుకునే స్తోమత లేని క్యాన్సర్ బాధితురాలిని ఆదుకోవాలని అభ్యర్థించాడు. అలాగే ామె ఫోటోను, ట్రీట్ మెంట్ షీట్ ను జత చేశాడు. దీంతో పళని ట్విట్ పై వెంటనే స్పందించారు మంత్రి కేటీఆర్..ఆ యువతికి తగిన సాయం అందిస్తానని, వెంటనే తనను కలవాల్సిందిగా పళనికి రీ ట్విట్ చేశారు.