Telangana: కేసీఆర్ మాట్లాడేవన్నీ అబద్ధాలే.. మునుగోడు తీర్పుతే పదవి నుంచి దిగిపోవాల్సిందే.. రాజగోపాల్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

|

Aug 21, 2022 | 6:03 AM

తెలంగాణలో (Telangana) రాజకీయ వేడి నెలకొంది. అధికార, విపక్ష పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం నెలకొంది. ఈ క్రమంలో రాష్ట్రంలో మరోసారి ఉపఎన్నిక అంశం తెరపైకి వచ్చింది. మునుగోడు అసెంబ్లీ స్థానానికి అక్కడి ఎమ్మెల్యే..

Telangana: కేసీఆర్ మాట్లాడేవన్నీ అబద్ధాలే.. మునుగోడు తీర్పుతే పదవి నుంచి దిగిపోవాల్సిందే.. రాజగోపాల్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
Komatireddy Rajagopal Reddy
Follow us on

తెలంగాణలో (Telangana) రాజకీయ వేడి నెలకొంది. అధికార, విపక్ష పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం నెలకొంది. ఈ క్రమంలో రాష్ట్రంలో మరోసారి ఉపఎన్నిక అంశం తెరపైకి వచ్చింది. మునుగోడు అసెంబ్లీ స్థానానికి అక్కడి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో ఆ స్థానం ఖాళీ అయింది. అక్కడ పోటీ చేసి ఆ అసెంబ్లీ స్థానాన్ని కైవసం చేసుకోవాలని కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో మునుగోడులో (Munugode) నిర్వహించిన సభలో సీఎం మాట్లాడారు. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలు, వ్యాఖ్యలపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. రాష్ట్రంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఎలాంటి అభివృద్ధి జరగడం లేదని మండిపడ్డారు. కేసీఆర్‌ మాట్లాడేవన్నీ అబద్ధాలేని, మునుగోడు ఇచ్చే తీర్పుతో కేసీఆర్‌ దిగిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. తెలంగాణ ఆత్మగౌరవం కోసమే ఉప ఎన్నిక వచ్చిందని చెప్పారు. ఎమ్మెల్యేలకు అపాయింట్‌ ఇవ్వడం లేదంటే అది కేసీఆర్‌ అహంకారం కాదా అని ప్రశ్నించారు. బీజేపీకి ఓటేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ మీటర్లు రావని వెల్లడించారు. కేసీఆర్‌ తన ప్రాభవం కోసం ఎప్పటికప్పుడు బీజేపీపై నిందలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాగా.. ము నుగోడు వేదికగా సీఎం కేసీఆర్ బీజేపీపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ప్రగతిశీల శక్తులు ఏకమై.. బీజేపీని దేశం నుంచి తరిమికొట్టాలని సూచించారు. తెలంగాణలో ఏడాదిలో ఎన్నికలు వస్తుండగా ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. గోల్‌మాల్‌ బైపోల్‌ అని మండిపడ్డారు. తెలంగాణకు కేంద్రం ఏం చేసిందో చెప్పాలని కేసీఆర్ ప్రశ్నించారు. మునుగోడులో వచ్చేది ఉప ఎన్నిక మాత్రమే కాదని, తెలంగాణ ప్రజల బతుకు దెరువు ఎన్నిక అంటూ సీఎం కేసీఆర్ చెప్పడం ప్రాధాన్యత నెలకొంది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ప్రభుత్వాలను బీజేపీ కూలగొడుతోందని మండిపడ్డారు.

మూడు తోకలు కూడా లేని పార్టీలు ఏక్ నాథ్ సిండేలను తీసుకొస్తాంటూ అహంకారంతో మాట్లాడుతున్నాయి. కాంగ్రెస్‌కు ఓటే వేస్తే అది వ్యర్ధం. ఏ ప్రధాన మంత్రి టైమ్‌లో లేనంత దారుణంగా ఇప్పుడు రూపాయి విలువ పడిపోయింది. మత విద్వేశాలను రెచ్చగొడుతున్న బీజేపీని తరిమికొట్టాలి. ఎనిమిదేళ్ల మోదీ పాలనలో దేశం ఏమి అభివృద్ధి సాధించింది. రూపాయి రికార్డు స్థాయిలో పడిపోయింది. నిరుద్యోగం పెరిగిపోయింది. దేశంలో అన్నీ అమ్మేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

– కేసీఆర్, తెలంగాణ ముఖ్యమంత్రి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..