AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Khairatabad Ganesh: బై బై గణేశా.. గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ మహా గణపతి!

హుస్సేన్‌ సాగర్‌లో ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం పూర్తయింది. ఖైరతాబాద్‌లోని గణేష్ మండపం నుంచి బయల్దేరిన భారీ గణనాథుడు ఎన్టీఆర్‌ మార్గ్‌లోని క్రెయిన్ నెంబర్ 4వద్దకు చేరుకోగా.. అక్కడే నిమజ్జనం పూర్తయింది. ఆ గణనాథుడు గంగమ్మ ఒడికి చేరే సమయంలో ఆ ప్రాంతం మొత్తం బై బై గణేశా నినాదాలతో మార్మోగింది.

Khairatabad Ganesh: బై బై గణేశా.. గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ మహా గణపతి!
Khairatabad Ganesh Immersion 2026
Anand T
|

Updated on: Sep 25, 2026 | 3:45 PM

Share

ఖైరతాబాద్‌ మహా గణేషుడి నిమజ్జనం ముగిసింది. గంగమ్మ ఒడికి చేరాడు భారీ గణనాథుడు. ఎన్టీఆర్ మార్గ్‌లోని క్రేన్ నెంబర్‌ 4 దగ్గర ఖైరతాబాద్ మహా గణేష్ నిమజ్జన ప్రక్రియ పూర్తయింది. బడా గణేష్‌ నిమజ్జనం తిలకించేందుకు హుస్సేన్‌ సాగర్‌కు భారీగా తరలివచ్చారు భక్తులు. దీంతో హుస్సెన్ సాగర్ పరిసర ప్రాంతాలు మొత్తం భక్తులతో కిక్కిరిపోయాయి. ఎన్టీఆర్ మార్గ్ మొత్తం డప్పు చప్పుళ్లు.. తీన్మార్ డాన్సర్లతో మార్మోగింది. ఆ మహా గణేషుడు గంగమ్మ ఒడికి చేరుతున్న తరుణంలో బై బై గణేశా అంటూ భక్తులు చేసిన నినాదాలతో పరిసర ప్రాంతాలు మొత్తం దద్దరిల్లాయి.

ఈ సారి 69 అడుగుల ఎత్తులో పంచముఖ సంకటహర మహాగణపతిగా భక్తులకు దర్శనమిచ్చారు ఆ బడా గణేష్.. ఇక సెప్టెంబర్ 14న నుంచి సుమారు 11 రోజుల పాటు పూజలు అందుకున్న ఆ గణనాథుడు నేడు ఉదయం 8 గంటల ప్రాంతంలో మండపం నుంచి ఊరేగింపుగా గంగంమ్మ ఒడికి బయల్దేరాడు. దాదాపు 4-5 గంటల పాటు సాగిన ఈ శోభయాత్రలో దేశ విదేశాల నుంచి వచ్చిన వేలా మంది భక్తులు పాల్గొన్నారు. దీంతో హైదరాబాద్‌లో పండగ వాతావరణం నెలకొంది. ఇక హుస్సేన్ సాగర్ (క్రేన్ నెం.4) వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన లాంగ్ బూమ్ క్రేన్ ద్వారా నిమజ్జనం పూర్తైయింది.

ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనంతో పాటు నగరంలో ఉన్న వేలాది విగ్రహాలు హుస్సెన్ సాగర్ బాట పట్టాయి. ఒక్కొక్కటిగా హుస్సెన్ సాగర్ చేరకుంటున్న విగ్రహాల నిమజ్జనం పూర్తి చేసుకుంటున్నాయి. మరోవైపు నిమజ్జనాలకు ఎలాంటి ఆటంకం లేకుండా పోలీసులు ప్రత్యేక ఏర్పాటు, భారీ భద్రత చర్యలు చేపట్టారు. దీంతో ఎలాటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఆ ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం ముగిసింది.

Ganesh

 

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us