
కాళేశ్వరం ప్రాజెక్ట్ మరో రికార్డును సొంతం చేసుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకంగా ఇప్పటికే గిన్నీస్ బుక్ రికార్డులకు ఎక్కి ఈ ప్రాజెక్ట్..మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా లక్ష్మీపూర్‌లో నిర్మించిన బాహుబలి గాయత్రి పంప్‌హౌస్ ఘనకీర్తి ఇప్పుడు ప్రపంచానికి తెలిసేలా న్యూయార్క్ టైమ్స్ పలు కథనాలను ప్రసారం చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద పంప్‌హౌస్‌గా రికార్డులకు ఎక్కిన గాయత్రి పంప్‌హౌస్ ఘనతను న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ ప్రముఖంగా ప్రస్తావించింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఘనతను ప్రపంచానికి తెలిసేలా న్యూయార్క్‌లోని ఓ కూడలిలో ఏర్పాటు చేసిన బిగ్ స్క్రీన్‌పై పలు వార్త కథనాల్ని ప్రసారం చేసింది. రోజుకు ఐదుసార్ల చొప్పున మొత్తం మూడు రోజుల పాటు గాయత్రి పంప్‌హౌస్, కాళేశ్వరం ప్రాజెక్ట్ గొప్పదనాన్ని, విశిష్టతలను వివరిస్తూ న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ స్టోరీలను ప్రసారం చేసింది.
కాగా ఈఫిల్ టవర్ ఎత్తును మించిన పొడవుతో గాయత్రి (లక్ష్మీపూర్) పంపుహౌజ్‌ను మేఘా ఇంజనీరింగ్ తీర్చిదిద్దింది. ప్రపంచంలోనే గొప్ప ఇంజనీరింగ్ కళాఖండంగా ఈ పంపుహౌజ్ ప్రపంచ ఇంజినీరింగ్ చరిత్రలో నిలిచిపోయింది. ప్రపంచంలోనే అత్యధిక సామర్థం ఉన్న పంపులు 139 మెగావాట్లను ఉపయోగిస్తూ 111 మీటర్ల మేర నీటిని ఎత్తిపోయాలన్న సంకల్పంతో దీన్ని మేఘా ఇంజినీరింగ్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా దీన్ని నిర్మించింది.
ఇదిలా ఉంటే ప్రపంచంలోనే ఈ పంప్‌హౌస్ అతి పెద్దది. ఇంతకు ముందెన్నడూ లేనిది. అందులోనూ భూగర్భంలోనిది. శక్తిరీత్యా, సామర్థాల ప్రకారం, నీటి పంపింగ్ లక్షం, పరిమాణం..ఇలా ఏ ప్రకారం చూసినా, గాయత్రి పంపుహౌజ్ ఇంజనీరింగ్ కళాఖండం. మానవ నిర్మిత ప్రపంచ అద్భుతాల్లో చేరే అన్ని లక్షణాలు దీనికి ఉన్నాయి. ప్రపంచంలో ఇంత పెద్ద నీటి పంపింగ్ కేంద్రం ఇంతవరకూ ఎక్కడా నిర్మించలేదు. ఒక్కో మిషన్ వారీగా చూస్తే సామర్థం 139 మెగావాట్లు కావడంతో ప్రపంచంలో ఇప్పటి వరకు ఇదే పెద్ద మిషన్. ఒక మొత్తం పంపింగ్ కేంద్రం ప్రకారం చూసినా 973 మెగావాట్లు కూడా అతి పెద్దది. ఇందులో వినియోగించిన ఎలక్ట్రికల్ మోటార్ పంపుహౌజ్‌లలో కాకుండా మొత్తంగా ప్రపంచంలో ఏ రంగంలోనూ ఇంత పెద్దది లేదు.