Telangana BJP: బీజేపీలో ఎన్నికల జోష్.. 14 కమిటీలకు చైర్మన్ల ప్రకటన.. హైదరాబాద్‌కు జేపీ నడ్డా..

JP Nadda Hyderabad visit: అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మిషన్‌ తెలంగాణను వేగవంతం చేసింది. ప్రధాని మోదీతో ఒకేవారంలో రెండు సభలు నిర్వహించి జోరుమీదున్న కమలదళం.. ఎన్నికల వరకూ అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. ఈ క్రమంలో బీజేపీ వ్యూహంలో భాగంగా క్యాడర్‌కు బలమైన సంకేతం ఇచ్చేందుకు ఇవాళ బీజపీ జాతీయ అధక్షుడు జేపీ నడ్డా ఇవాళ హైదరాబాద్‌కు రానున్నారు.

Telangana BJP: బీజేపీలో ఎన్నికల జోష్.. 14 కమిటీలకు చైర్మన్ల ప్రకటన.. హైదరాబాద్‌కు జేపీ నడ్డా..
Telangana Bjp

Updated on: Oct 05, 2023 | 1:05 PM

JP Nadda Hyderabad visit: అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మిషన్‌ తెలంగాణను వేగవంతం చేసింది. ప్రధాని మోదీతో ఒకేవారంలో రెండు సభలు నిర్వహించి జోరుమీదున్న కమలదళం.. ఎన్నికల వరకూ అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. ఈ క్రమంలో బీజేపీ వ్యూహంలో భాగంగా క్యాడర్‌కు బలమైన సంకేతం ఇచ్చేందుకు ఇవాళ బీజపీ జాతీయ అధక్షుడు జేపీ నడ్డా ఇవాళ హైదరాబాద్‌కు రానున్నారు. రేపు బీజేపీ రాష్ట్ర కౌన్సిల్‌ భేటీ జరగనుంది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యేందుకు బీజేపీ జాతీయ అధ్యకుడు జేపీ నడ్డా గురువారం రాత్రి హైదరాబాద్‌ చేరుకుంటారు. అనంతరం కీలక నేతలతో నడ్డా భేటీ కానున్నారు. ముఖ్యంగా తెలంగాణ బీజేపీ గెలుపే లక్ష్యంగా నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇదిలాఉంటే.. కౌన్సిల్ సమావేశానికి ముందు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అధ్యక్షతన గురువారం పదాధికారుల సమావేశం ప్రారంభమైంది. జిల్లా, అసెంబ్లీ నిర్వహణ కమిటీల ఏర్పాటుపై ఈ సమావేశంలో చర్చ జరుగుతోంది. కౌన్సిల్ సమావేశంలో ప్రవేశపెట్టే తీర్మానాలపై కూడా నేతలు చర్చిస్తున్నారు.

ముఖ్యంగా పెండింగ్‌ సమస్యలు పరిష్కరిస్తూ తెలంగాణ ఓటర్లను ప్రసన్నం చేసుకునే దిశగా కమలం పార్టీ పావులు కదుపుతోంది. మహబూబ్‌నగర్‌ సభలో ప్రధాని ప్రకటించిన జాతీయ పసుపు బోర్డుతో పాటు ములుగులో సమ్మక్క, సారక్క గిరిజన వర్సిటీ ఏర్పాటుకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. వీటితో పాటు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ మధ్య కృష్ణా జలాల వాటా పంపిణీ బాధ్యతలను.. కృష్ణా జలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్‌కు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వాటాలో స్పష్టత వస్తే తెలంగాణలోని 50 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ నేపథ్యంలో నడ్డా పర్యటన తెలంగాణలో కీలకం కానుంది.

14 కమిటీలకు చైర్మన్ల ప్రకటన..

ఇదిలాఉంటే.. ఎన్నికల కోసం తెలంగాణ కమలదళం 14 కమిటీలను ప్రకటించింది. సీనియర్లు, అసంతృప్తులకు ప్రాధాన్యత ఇస్తూ కమిటీలను ప్రకటించింది. కొందరికి బుజ్జగింపులు చేస్తూనే.. మరికొందరి సీనియారిటీకి ప్రాధాన్యం ఇస్తూ బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా అధికార పార్టీని ఎదుర్కొనే వ్యూహంలో భాగంగా కమలం పార్టీ ఎన్నికల కోసం ఏకంగా 14 కమిటీల చైర్మన్లను ప్రకటించింది.

ఏ కమిటీకి ఎవరు చైర్మన్‌గా ఉంటారంటే..

  • పబ్లిక్‌ మీటింగ్స్ కమిటీ చైర్మన్‌గా బండి సంజయ్‌
  • స్క్రీనింగ్‌ కమిటీ చైర్మన్‌గా రాజగోపాల్‌రెడ్డి
  • మేనిఫెస్టో, పబ్లిసిటీ కమిటీ చైర్మన్‌గా వివేక్ వెంకటస్వామి.. కన్వీనర్‌గా మహేశ్వర్ రెడ్డి, జాయింట్ కన్వీనర్‌గా కొండా విశ్వేశ్వర్ రెడ్డి..
  • పోరాటాల కమిటీ చైర్‌పర్సన్‌గా విజయశాంతి
  • చార్జిషీట్‌ కమిటీ చైర్మన్‌గా మురళీధర్‌రావు
  • సోషల్‌మీడియా కమిటీ చైర్మన్‌గా ధర్మపురి అర్వింద్
  • ఈసీ వ్యవహారాల కమిటీ చైర్మన్‌గా మర్రిశశిధర్‌రెడ్డి
  • కో-ఆర్డినేషన్‌ కమిటీ చైర్మన్‌గా ఇంద్రసేనారెడ్డి
  • SC నియోజకవర్గాల కో-ఆర్డినేషన్ కమిటీ చైర్మన్‌గా జితేందర్‌ రెడ్డి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..