Watch Video: వియత్నాంలో MBBS చదువుతున్న తెలంగాణ విద్యార్థి దుర్మరణం.. వీడియో వైరల్

వియత్నాంలో MBBS చదువుతున్న 21 ఏళ్ల తెలంగాణ విద్యార్థి రోడ్డు ప్రమాదంలో మరణించాడు. మృతుడిని MBBS మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థిగా గుర్తించారు. తెలంగాణలోని కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన సదరు విద్యార్ధి తల్లిదండ్రులు అర్షిద్ అర్జున్, ప్రతిమ బట్టల వ్యాపారులు. మితిమీరిన వైగంతో బైక్‌పై వెళ్తు ఓ ఇంటి గోడను బలంగా ఢీ కొనడంతో..

Watch Video: వియత్నాంలో MBBS చదువుతున్న తెలంగాణ విద్యార్థి దుర్మరణం.. వీడియో వైరల్
Telangana MBBS Student Died In Vietnam

Updated on: Jun 05, 2025 | 5:54 PM

హైదరాబాద్, మే 6: వియత్నాంలో MBBS చదువుతున్న 21 ఏళ్ల తెలంగాణ విద్యార్థి మృతి చెందాడు. బైక్ పై వేగంగా వెళ్తూ గోడని ఢీకొట్టి మృతి చెందాడు. తెలంగాణలోని కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ కు చెందిన ఎంబీబీఎస్ విద్యార్థి అష్రిత్ వియత్నాం దేశంలోని కాన్ థో నగరంలో దుర్మరణం చెందాడు.

కాగజ్ నగర్ పట్టణంలోని మార్కెట్ ఏరియాలో బట్టల వ్యాపారి అర్షిద్ అర్జున్- ప్రతిమ దంపతులకు కుమారుడు అర్షిద్ అష్రిత్ (21). అష్రిత్ వియత్నాం దేశంలోని కాంతో సిటీలో ఎంబీబీఎస్ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. అయితే బుధవారం తెల్లవారుజామున స్నేహితుడితో 150 సీసీ బైక్ పై అతివేగంగా వెళ్తూ ఒక ఇంటి గోడను బలంగా ఢీ కొట్టాడు. ఈ ఘటనలో అష్రిత్ అక్కడికక్కడే మృతి చెందగా, వెనుక సీట్లో కూర్చున్న అతడి స్నేహితుడు తీవ్రంగా గాయపడ్డాడు. కుమారుడి మృతి చెందిన విషయం తెలిసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు.

ప్రమాదానికి సంబంధించిన భయానక దృశ్యాలను CCTV కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ వీడియో క్లిప్‌లో తెల్లవారు జామున పెద్దగా రద్దీలేని రోడ్డుపై వేగంగా వస్తున్న బైక్ ఒకటి కనిపించింది. బైక్ నేరుగా గోడను ఢీ కొట్టడం వీడియోలో కనిపించింది. అనంతరం బైక్‌పై ఉన్న ఇద్దరు గాల్లోకి ఎగిరిపడటం వీడియోలో చూడొచ్చు. తెలంగాణ ఎమ్మెల్యే డాక్టర్ పి హరీష్ బాబు ఆశ్రిత్ ఇంటికి చేరుకుని అతడి తల్లిదండ్రులను ఓదార్చారు. ఎమ్మెల్యే కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డితో కూడా ఫోన్‌లో మాట్లాడి మృతదేహాన్ని భారత్‌కు తరలించడానికి వీలు కల్పించాలని కోరారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us