Viral Video: హైదరాబాదీ వింత ఆలోచన.. నామినేషన్ దాఖలకు ఎలా వెళ్లాడో చూడండి

|

Apr 26, 2024 | 2:23 PM

తమ బలాన్ని, బలగాన్ని నిరూపించుకునేందుకు పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహిస్తూ నామినేషన్‌ దాఖలు కార్యక్రమానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో ర్యాలీకోసం ఒక్కొక్కరూ ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటున్నారు. అయితే తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి నామినేషన్‌ కేంద్రానికి వెళ్లిన తీరు అందరి దృష్టి ఆకర్షిస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది...

Viral Video: హైదరాబాదీ వింత ఆలోచన.. నామినేషన్ దాఖలకు ఎలా వెళ్లాడో చూడండి
Viral Video
Follow us on

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల హంగామా నడుస్తోంది. ఇప్పటికే తొలి దశ ఎన్నికలు విజయవంతంగా కాగా శుక్రవారం రెండో దశ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక నామినేషన్‌ దాఖలుతో పలు రాష్ట్రాల్లో సందడి నెలకొంది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్నికల వేడి రాజుకొంది. దీంతో ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు నామినేషన్ దాఖలు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు.

తమ బలాన్ని, బలగాన్ని నిరూపించుకునేందుకు పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహిస్తూ నామినేషన్‌ దాఖలు కార్యక్రమానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో ర్యాలీకోసం ఒక్కొక్కరూ ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటున్నారు. అయితే తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి నామినేషన్‌ కేంద్రానికి వెళ్లిన తీరు అందరి దృష్టి ఆకర్షిస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఇంతకీ అతను చేసిన ఆ పనెంటో ఇప్పుడు తెలుసుకుందాం.

 

హైదరాబాద్‌ నియోజకవర్గం నుంచి లోక్‌సభ ఎన్నికలో పోటీ చేస్తున్న ఓ స్వతంత్ర అభ్యర్థి తాజాగా నామినేషన్‌ దాఖలు చేశారు. అయితే ఈ క్రమంలోనే నామినేషన్‌ దాఖలుకు ఒంటెపై సవారి చేస్తూ కార్యాలయానికి చేరుకున్నారు. దీంతో దీనిని చూసిన కొందరు తమ స్మార్ట్ ఫోన్‌లో వీడియో రికార్డ్‌ చేశారు. ఈ వీడియోను కాస్త సోషల్‌ మీడియాలో పోస్ట్ చేయగా నెట్టింట తెగ వైరల్‌ అయ్యింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను చార్మినార్‌ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు తెలిపారు. తనకు ఎన్ని ఓట్లు వస్తుందన్న దానిపై ప్రశ్నించగా.. అది దేవుని చేతిలో ఉంది అంటూ చెప్పుకొచ్చారు.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..