IT Raids: హైదరాబాద్‌లో ఐటీ అధికారుల సోదాలు.. ఆర్‌.ఎస్‌. బ్రదర్స్‌‌‌‌లో కొనసాగుతున్న దాడులు..

|

Oct 14, 2022 | 12:02 PM

కూకట్ పల్లి, జూబ్లీహిల్స్,  కూకట్ పల్లి, దిల్ సుఖ్ నగర్  సహా 10 చోట్ల ఏక కాలంలో ఐటీ అధికారుల సోదాలు నిర్వహిస్తున్నారు. రియల్ ఏస్టేట్, వ్యాపార సంస్థల్లో ఐటీ..

IT Raids: హైదరాబాద్‌లో ఐటీ అధికారుల సోదాలు.. ఆర్‌.ఎస్‌. బ్రదర్స్‌‌‌‌లో కొనసాగుతున్న దాడులు..
It Raids
Follow us on

హైదరాబాద్ నగరంలోని ఆరు చోట్ల ఐటీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. షాపింగ్ మాల్స్‌కు సంబంధించిన ఆఫీసులతోపాటు వారి ఇళ్లలో కూడా సోదాలు చేశారు. కూకట్ పల్లి, జూబ్లీహిల్స్,  కూకట్ పల్లి, దిల్ సుఖ్ నగర్  సహా 10 చోట్ల ఏక కాలంలో ఐటీ అధికారుల సోదాలు నిర్వహిస్తున్నారు. రియల్ ఏస్టేట్, వ్యాపార సంస్థల్లో ఐటీ అధికారులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. రియల్ ఏస్టేట్ సంస్థలు నిర్వహిస్తున్న యజమానుల ఇళ్లలో  ఐటీ అధికారులు నిర్వహిస్తున్నారు.

ఇటీవల కాలంలో రియల్ ఎస్టేట్ రంగంలో ఆర్‌ఎస్ బ్రదర్స్ భారీగా పెట్టుబడి పెట్టింది. హానర్స్ రియల్ ఇన్ఫ్రా పేరుతో ఆర్ఎస్ బ్రదర్స్ వ్యాపారం చేస్తోంది. వాసవితో పాటు పలు ప్రాజెక్టులను హానర్స్ సంస్థ చేపట్టింది. కూకట్‌పల్లిలోని గల్ఫ్ ఆయిల్ ల్యాండ్ వివాదాల్లో కూడా హానర్స్ జోక్యం చేసుకుంది.

ఈ క్రమంలో హానర్స్, సుమధుర, వాసవిల పరంపర ఆర్ఎస్ బ్రదర్స్‌పై ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. వాసవి, సుమధురతో కలిసి ఆర్‌ఎస్ బ్రదర్స్ వ్యాపారాలు చేస్తోంది. R.S. బ్రదర్స్‌ డైరెక్టర్లు పొట్టి వెంకటేశ్వర్లు, పొట్టి సత్యనారాయణ, టి.ప్రసాద్‌రావు.. అభినయ్‌ వెంకట్‌సాయి, రాకేశ్‌, కేశవ్‌ గుప్తా, సీర్న రాజమౌళి, సురేష్‌ ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం