
చెరువుతో సంబంధం లేకపోయినా ప్రైవేట్ ఆస్తులను హైడ్రా కూల్చివేసిందన్నది మాదాపూర్‌లోని సున్నంచెరువు దగ్గర సియెట్ సొసైటీ వాసుల కడుపుమంట. హైడ్రా లక్ష్యం ఏదైనా… అది నానా వంకర్లూ తిరిగి.. వైఫల్యాల్ని మూటగట్టుకుంది. జనం తోడుతోనే నగరాన్ని బాగుచేద్దామన్న హైడ్రా మూలసిద్ధాంతం కాస్తా అడ్డం తిరిగిందా? అన్న ప్రశ్నలు కొన్ని వైపుల నుంచి వస్తున్నాయి. మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 7 వరకు దంచికొట్టిన వానతో భాగ్యనగరం నిండా మునిగి.. ట్రాఫిక్ ఫికర్‌తో బెంబేలెత్తిపోయింది. గచ్చిబౌలీ గట్రా కాస్ట్‌లీ కాస్మొపొలిటన్ ఏరియాలే బావురుమన్న వేళ.. ఒక షోరూమ్‌లో పది అడుగుల మేర నీళ్లుచేరి, 40 మంది సిబ్బంది చిక్కుకుపోతే ఓ చెయ్యందించి బైటికి లాగి ప్రాణం పోసింది హైడ్రా. మోకాల్లోతు నీళ్లల్లో దిగి స్వయానా కమిషనర్ రంగనాథే రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. దిసీజ్ ది కమిట్‌మెంట్ ఆఫ్ హైడ్రా అని చేతల్లో చూపెట్టే ప్రయత్నం చేశారు. ఒకేరోజు జరిగిన ఈ రెండు ఘటనలు చాలు హైడ్రా పిక్చర్ పర్‌ఫెక్ట్‌గా ఉందా గందరగోళాన్ని పెంచిందా తెలీడానికి. ఏదైనా సంస్కరణ మొదలైనప్పుడు దానికి ఆటుపోట్లు తప్పవు. ముందుకెళ్లాలన్న ఆలోచనతో పాటే వెనక్కు లాగే పరిస్థితులూ ఉంటాయి. అలాగే హైడ్రాకూ తప్పలేదు పురిటినొప్పులు. ఆశయం గొప్పదే కావచ్చు.. ఆచరణ దగ్గరేగా తలనొప్పులు? హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఎసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ.. హైడ్రా! చెరువులు, నాలాలు, పార్కులు, రోడ్లు, ప్రభుత్వ స్థలాల రక్షణ కోసం ఏర్పాటైన ప్రత్యేక యంత్రాంగం. జీహెచ్ ఎంసీ, దాని...