Hyderbad: వాహనదారులు తస్మాత్‌ జాగ్రత్త.. ఆ పని చేస్తే వాహనాలను జప్తు చేస్తామంటున్న పోలీసులు..

|

Jul 17, 2022 | 6:05 AM

Hyderbad: ట్రాఫిక్‌ నిబంధనలు కఠినంగా అమలు చేసే క్రమంలో హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు (Traffic Police) టెక్నాలజీ ఉపయోగించుకుంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా...

Hyderbad: వాహనదారులు తస్మాత్‌ జాగ్రత్త.. ఆ పని చేస్తే వాహనాలను జప్తు చేస్తామంటున్న పోలీసులు..
Follow us on

Hyderbad: ట్రాఫిక్‌ నిబంధనలు కఠినంగా అమలు చేసే క్రమంలో హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు (Traffic Police) టెక్నాలజీ ఉపయోగించుకుంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా హెల్మట్‌ ధరించని వారి వాహనాల నెంబర్లను కెమెరాతో బంధించి ఆన్‌లైన్‌ ద్వారా చలాన్లను పంపిస్తున్నారు. అయితే దీని నుంచి తప్పించుకునేందుకు గాను కొందరు నంబర్‌ ప్లేట్‌ను తొలగించడం లేదా నెంబర్‌ కనిపించకుండా ప్లేట్‌ను వంచడం లాంటివి చేస్తున్నారు. దీంతో ఇలాంటి వారికి హైదరాబాద్ ట్రాఫిక్‌ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.

రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్లు మార్చినా, సరియైన రీతిలో వాహన నంబర్ ప్లేట్ ఉండకపోయినా, నంబర్ ప్లేట్ వంచినా, నంబర్ ప్లేటుపై నంబర్ కనబడకుండా ఏదైనా అతికించినా కఠినంగా వ్యవహరిస్తామని తేల్చి చెప్పారు. ఎవరైనా ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలను జప్తు చేయడంతో పాటు, న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన కాల పరిమితి మించిన తర్వాత కూడా తాత్కాలిక రిజిస్ట్రేషన్ నంబర్‌తో వాహనాన్ని నడిపించినా.. న్యాయపరమైన చర్యలకు బాధ్యులు అవుతారని పోలీసులు తెలిపారు. శుక్రవారం రోజు జరిపిన స్పెషల్‌ డ్రైవ్‌లో 52 వాహన యజమానులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..