Hanuman Jayanti: నేడే వీరహనుమాన్ శోభాయాత్ర.. నగరంలో ట్రాఫిక్ ఆంక్షల అమలు.. పూర్తి వివరాలివే

| Edited By: Ravi Kiran

Apr 16, 2022 | 10:40 AM

ఏటా హనుమజ్జయంతి సందర్భంగా నిర్వహించే వీరహనుమాన్‌ విజయయాత్రకు సమయం ఆసన్నమైంది. యాత్రను ప్రశాంతంగా పూర్తి చేసేందుకు పోలీసు అధికారులు సిద్ధమయ్యారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా....

Hanuman Jayanti: నేడే వీరహనుమాన్ శోభాయాత్ర.. నగరంలో ట్రాఫిక్ ఆంక్షల అమలు.. పూర్తి వివరాలివే
Hyderabad Traffic
Follow us on

ఏటా హనుమజ్జయంతి సందర్భంగా నిర్వహించే వీరహనుమాన్‌ విజయయాత్రకు సమయం ఆసన్నమైంది. యాత్రను ప్రశాంతంగా పూర్తి చేసేందుకు పోలీసు అధికారులు సిద్ధమయ్యారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా పోలీసులు మోహరించారు. గౌలిగూడ రామ్‌మందిర్‌ నుంచి తాడ్‌బండ్‌లోని వీరాంజనేయస్వామి దేవాలయం వరకూ 21 కిలోమీటర్ల మేర ఈ యాత్ర కొనసాగనుంది. శనివారం ఉదయం 11 గంటలకు ప్రారంభమై రాత్రి 8 గంటలకు యాత్ర ముగియనుంది. ఈ మేరకు కొత్వాల్‌ సీవీ ఆనంద్‌.. తాడ్‌బండ్‌ వీరాంజనేయ స్వామిని దర్శించుకున్నారు. ఊరేగింపును ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు చర్యలు చేపట్టారు. సీసీ కెమెరాలను ఆయా పోలీస్ స్టేషన్ల ద్వారా కంట్రోల్‌ రూంకు అనుసంధానించి పరిశీలించనున్నారు. నాలుగు డ్రోన్‌ కెమెరాలు పహారా ఏర్పాటు చేశారు. హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా.. పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఊరేగింపు జరగనున్న ప్రాంతాల్లో శనివారం ఉదయం 11గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.

ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 12.30 సమయంలో గౌలిగూడ రామ్‌మందిర్‌ నుంచి ఆంధ్రా బ్యాంక్‌ కోఠి వరకు, మధ్యాహ్నం 12.30 – 1.30 వరకు కోఠీలోని డీఎంహెచ్‌ కార్యాలయం నుంచి కాచిగూడ క్రాస్‌రోడ్స్‌ వరకు, మధ్యాహ్నం 1.30 – 2.15 గంటల వరకు కాచిగూడ క్రాస్‌రోడ్స్‌ నుంచి నారాయణగూడ క్రాస్ రోడ్స్‌ వరకు, మధ్యాహ్నం 2.15 – 4.15 ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌, వీఎస్‌టీ, బాగ్‌లింగంపల్లి, ఇందిరాపార్క్‌, కవాడీగూడ క్రాస్‌రోడ్స్‌ వరకు, సాయంత్రం 4.15-5.45 పాత రాంగోపాల్‌పేట ఠాణా వరకు, సాయంత్రం 6 – 7 ప్యారడైజ్‌ కూడలి నుంచి బ్రూక్‌బాండ్‌ కాలనీ వరకు, సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు బ్రూక్‌బాండ్‌ నుంచి తాడ్‌బండ్‌ వీరాంజనేయ స్వామిదేవాలయం వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు.

మరోవైపు.. హనుమజ్జయంతి సందర్భంగా రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6గంటల వరకు మద్యం అమ్మకాలు ఉండవని సీపీ మహేష్‌ భగవత్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజలందరూ ఈ మార్పులను గమనించి, సహకరించాలని కోరారు.

Also Read

KGF 2: స్టార్ హీరోలకు భారీ రెమ్యునరేషన్స్ వద్దంటోన్న RGV.. ట్విట్టర్లో సంచలన కామెంట్స్..

Viral Video: బాప్ రే.. టెన్నీస్ బాల్ సైజ్‌లో వడగళ్లు.. ఇంత భీకర వర్షం ఎప్పుడూ లేదు..! షాకింగ్ వీడియో

Shruti Haasan: సోయగాల శ్రుతిహాసన్ కు సోషల్ మీడియా ఫిదా.. అమ్మడి ఫోటోలు అదుర్స్