వీకెండ్ కిక్కు దిగింది.. పట్టుబడ్డ వారిలో వీరు కూడా..!

| Edited By:

Jan 19, 2020 | 7:38 AM

వాహన చట్టాల్లో ఎన్ని మార్పులు చేసినా.. వాహనాదారులు మాత్రం వాటిని పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా మద్యం సేవించి వాహనాలను నడపొద్దని పోలీసులు ఎంత చెప్పినా.. నగర వాసులు వీ డోంట్ కేర్ అంటూ.. ప్రతి సారి పట్టుబడుతూనే ఉన్నారు. వీకెండ్‌లో నగరంలో ట్రాఫిక్ పోలీసులు జరిపే డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ప్రతిసారి ఎంతో కొంతమంది మద్యం మత్తులో పట్టుబడుతూనే ఉన్నారు. శనివారం బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లో మందుబాబుల కిక్ దించారు పోలీసులు. రాత్రి జరిపిని స్పెషల్ డ్రంక్ అండ్ […]

వీకెండ్ కిక్కు దిగింది.. పట్టుబడ్డ వారిలో వీరు కూడా..!
Follow us on

వాహన చట్టాల్లో ఎన్ని మార్పులు చేసినా.. వాహనాదారులు మాత్రం వాటిని పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా మద్యం సేవించి వాహనాలను నడపొద్దని పోలీసులు ఎంత చెప్పినా.. నగర వాసులు వీ డోంట్ కేర్ అంటూ.. ప్రతి సారి పట్టుబడుతూనే ఉన్నారు. వీకెండ్‌లో నగరంలో ట్రాఫిక్ పోలీసులు జరిపే డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ప్రతిసారి ఎంతో కొంతమంది మద్యం మత్తులో పట్టుబడుతూనే ఉన్నారు. శనివారం బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లో మందుబాబుల కిక్ దించారు పోలీసులు. రాత్రి జరిపిని స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో.. మద్యం తాగి వాహనాలు నడుపుతూ.. 32 మంది వాహనదారులు పట్టుబడ్డారు. వీరిపై వీరిపై కేసులు నమోదు చేశారు. 16 కార్లు,16 బైక్ లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డవారిలో నలుగురు మహిళలు కూడా ఉన్నారు. మద్యం తాగి దొరికిపోయిన వాళ్లందరికీ కుటుంబసభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చి కోర్టులో హాజరుపరుస్తామన్నారు పోలీసులు.