Hyderabad: చైతన్యపురిలో ట్రాక్టర్ బీభత్సం..షాకింగ్ విజువల్స్..

|

Feb 29, 2020 | 9:08 PM

హైదరాబాద్‌ చైతన్యపురిలో ఓ ట్రాక్టర్‌ బీభత్సం సృష్టించింది. వాహనం అదుపుతప్పితే ఎలా ఉంటుందో కళ్లకు కట్టింది. స్థానిక గణేష్‌పురి కాలనీలో ప్రమాదానికి గురైన ట్రాక్టర్‌ డిస్మెంటల్‌ లోడ్డుతో వెళ్తోంది. అయితే డ్రైవర్‌కి ఒక్కసారిగా ఫిట్స్ రావడంతో.. స్టీరింగ్‌ డ్రైవర్‌ కంట్రోల్‌ తప్పింది.

Hyderabad:  చైతన్యపురిలో ట్రాక్టర్ బీభత్సం..షాకింగ్ విజువల్స్..
Follow us on

Hyderabad: హైదరాబాద్‌ చైతన్యపురిలో ఓ ట్రాక్టర్‌ బీభత్సం సృష్టించింది. వాహనం అదుపుతప్పితే ఎలా ఉంటుందో కళ్లకు కట్టింది. స్థానిక గణేష్‌పురి కాలనీలో ప్రమాదానికి గురైన ట్రాక్టర్‌ డిస్మెంటల్‌ లోడ్డుతో వెళ్తోంది. అయితే డ్రైవర్‌కి ఒక్కసారిగా ఫిట్స్ రావడంతో.. స్టీరింగ్‌ డ్రైవర్‌ కంట్రోల్‌ తప్పింది. దూకుడుగా వాహనాలను గుద్దేసుకుంటూ రావడాన్ని గుర్తించిన ఓ చిన్నారి ముందే తేరుకుని ఇంట్లోకి ఉరికాడు.

తర్వాత ఆ ట్రాక్టర్‌ సృష్టించిన బీభత్సం సీసీ టీవీలో కళ్లకు కట్టింది. డ్రైవర్‌ సీట్లో కూర్చున్న వ్యక్తి ఎగిరి కింద పడగా.. అతనిపై నుంచే ట్రాక్టర్‌ వెళ్లింది. డ్రైవర్‌ సీటు పక్కన కూర్చున్న వ్యక్తి మాత్రం.. కదలకుండా గట్టిగా పట్టుకుని ఉండడంతో బతికిపోయాడు. అప్పటికే ట్రాక్టర్‌ అడ్డంగా ఉన్న వాహనాలపైకి దూసుకుని ముందుకు వెళ్లింది. చివరకు ఓ ఇంటిప్రహారీ గోడను ఢీ కొని ఆగిపోయింది. ఈ ఘటనలో రెండు కార్లు, ఐదు బైకులు ధ్వంసం అయ్యాయి. ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. డ్రైవర్‌ మాత్రం గాయపడడంతో అతన్ని ఆసుపత్రికి తరలించారు.