హైదరాబాద్‌లో నిలిచిన మెట్రో.. ఎల్బీనగర్ టు అమీర్‌పేట్ మెట్రో రైలులో సాంకేతికలోపం.. ఇబ్బందుల్లో ప్రయాణికులు..!

|

Feb 08, 2021 | 1:01 PM

ఎల్బీనగర్ నుంచి అమీర్‎పేట్ మార్గంలో 20నిమిషాల పాటు మెట్రో సర్వీసులు నిలిచిపోయాయి. దీంతో ఉదయం వేళ ప్రయాణికులు ఆఫీసులకు వెళ్లే టైం కావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోన్నారు.

హైదరాబాద్‌లో నిలిచిన మెట్రో.. ఎల్బీనగర్ టు అమీర్‌పేట్ మెట్రో రైలులో సాంకేతికలోపం.. ఇబ్బందుల్లో ప్రయాణికులు..!
Hyderabad Metro
Follow us on

Hyderabad metro train stopped : హైదరాబాద్ మహానగరంలోని మెట్రో రైల్‎లో మరోసారి లోపాలు బయటపడ్డాయి. ఎల్బీనగర్ నుంచి అమీర్‎పేట్ మార్గంలో 20నిమిషాల పాటు మెట్రో సర్వీసులు నిలిచిపోయాయి. దీంతో ఉదయం వేళ ప్రయాణికులు ఆఫీసులకు వెళ్లే టైం కావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోన్నారు. గడిచిన 20రోజుల్లో తరచుగా సాంకేతిక సమస్యలు రావడంతో ప్రయాణికుల్లో ఆందోళన చెందుతున్నారు. దీనిపై సంబంధిత అధికారులు స్పందిస్తూ సాంకేతిక లోపం వల్ల మెట్రో ట్రైన్ పట్టాలపై నిలిచిపోయిందని అధికారులు తెలిపారు. వెంటనే మెట్రో సిబ్బంది మరమ్మత్తులు చేపట్టి మెట్రో రైళ్లను పునరుద్ధరించారు.

ఎల్బీనగర్ టు అమీర్‌పేట్ మెట్రో రైలులో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. వల్ల చాలా సేపు నిలిపి వేయడం జరిగింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఉదయం ఆఫీసులకు వెళ్లే ప్రయాణికులకు మెట్రోరైలు ఎంతో సౌకర్యంగా ఉండటంతో మెట్రోనే ఆశ్రయిస్తున్నారు. ప్రయాణికులు. మెట్రో రైళ్లలో సాంకేతిక సమస్యలు రావడంతో ఎల్బీనగర్ – అమీర్‌పేట్ రూట్‌లోని ఇతరత మెట్రో రైళ్లను దాదాపు 20 నిమిషాల పాటు నిలిపి వేయడం జరిగిందని మెట్రో అధికారులు తెలిపారు. మెట్రో రైలు కదలకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గతంలో కూడా పలుసార్లు ఇలాగే మెట్రో రైలు నిలిచిపోయిన ఘటనలు చోటు చేసుకున్నాయి.

ఇదీ చదవండి… తెలంగాణలో కొత్తగా 101 మందికి కరోనా నిర్థారణ.. 24 గంటల వ్యవధిలో కోవిడ్ బారినపడి ఒకరు మ‌ృతి