Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సేవల్లో అంతరాయం.. ప్రయాణికుల ఇబ్బందులు
హైదరాబాద్‌లో మరోసారి మెట్రో సేవల్లో అంతరాయం ఏర్పడింది. సాంకేతిక కారణాలతో నాగోలు-రాయదుర్గం రూట్‌లోని మెట్రో సేవలు దాదాపు రెండు గంటల పాటు నిలిచిపోయాయి. అమీర్‌పేట నుంచి హైటెక్ సిటీ, నాగోలు నుంచి సికింద్రాబాద్, మియాపూర్ నుంచి అమీర్‌పేట మధ్య మెట్రో రైళ్లు ఆగిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
![Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సేవల్లో అంతరాయం.. ప్రయాణికుల ఇబ్బందులు](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/01/hyderabad-metro-1.jpg?w=1280)
హైదరాబాద్‌లో మరోసారి మెట్రో సేవల్లో అంతరాయం ఏర్పడింది. సాంకేతిక కారణాలతో నాగోలు-రాయదుర్గం రూట్‌లోని మెట్రో సేవలు దాదాపు రెండు గంటల పాటు నిలిచిపోయాయి. అమీర్‌పేట నుంచి హైటెక్ సిటీ, నాగోలు నుంచి సికింద్రాబాద్, మియాపూర్ నుంచి అమీర్‌పేట మధ్య మెట్రో రైళ్లు ఆగిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం నాగోలుకు బదులుగా తార్నాక నుంచే మెట్రో రైళ్లు నడుస్తున్నాయి. సాంకేతిక కారణాలతో ఆయా మార్గాల్లో మెట్రో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఉదయం సమయం కావడంతో ఆఫీసులకు వెళ్లే ప్రయాణికులతో మెట్రో స్టేషన్లు రద్దీగా ఉన్నాయి. మెట్రో స్టేషన్లలో వేలాది సంఖ్యలో ప్రయాణికులు వచ్చి.. నిలబడిపోయారు.
సాంకేతిక కారణాలతో మెట్రో రైళ్లు నిలిచిపోవడంతో కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు, పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమస్యను పరిష్కరించేందుకు మెట్రో అధికారులు చర్యలు చేపట్టారు.
Dear Passengers,
Earlier today, Hyderabad Metro Rail services encountered a temporary disruption caused by a signaling system technical glitch. We worked promptly to resolve the issue, and normal services have been restored. We regret any inconvenience this may have caused our…
— L&T Hyderabad Metro Rail (@ltmhyd) January 29, 2025
మెట్రో కీలక ప్రకటన..
దీనిపై హైదరాబాద్ మెట్రో ప్రకటన విడుదల చేసింది.. సిగ్నలింగ్ సిస్టమ్ సాంకేతిక లోపం కారణంగా హైదరాబాద్ మెట్రో రైలు సర్వీసులకు తాత్కాలిక అంతరాయం ఏర్పడిందని.. తాము సమస్యను పరిష్కరించడానికి తక్షణమే పని చేసామని చెప్పింది. సాధారణ సేవలు పునరుద్ధరించామని.. దీని వల్ల ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామంటూ తెలిపింది.