Hyderabad: హైదరాబాదీలకు పండగే.. డిసెంబర్‌ 31న అర్థరాత్రి తర్వాత కూడా..

హైదరాబాదీలు రాత్రి రోడ్లపై చేసే హంగామా ఓ రేంజ్‌లో ఉంటుంది. హోటల్స్‌, మాల్స్‌, పబ్స్‌ ఇలా అన్నీ అర్థరాత్రి వరకు ఓపెన్‌ ఉంటాయి. దీంతో నగర పౌరులు డిసెంబర్‌ 31ని గ్రాండ్‌గా ప్లాన్‌ చేసుకుంటారు. ఇలాంటి వారి కోసమే ప్రయాణానికి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో హైదరాబాద్‌ మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది. ఈరోజు రాత్రి మెట్రో వేళలను పొడగిస్తున్నట్లు...

Hyderabad: హైదరాబాదీలకు పండగే.. డిసెంబర్‌ 31న అర్థరాత్రి తర్వాత కూడా..
Hyderabad

Updated on: Dec 31, 2023 | 7:11 AM

మరికొన్ని గంటల్లో కొత్తేడాదికి గ్రాండ్‌గా వెల్‌కమ్‌ చెప్పేందుకు ప్రజలంతా సిద్ధమవుతున్నారు. ప్రాంతం, కులం, మతంతో సంబంధం లేకుండా అందరూ కలిసి చేసుకునే వేడుక న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌. దీంతో కొత్తేడాదికి కోటి ఆశలతో ఆహ్వానించేందుకు ప్లాన్స్‌ వేసుకున్నారు. ఇక డిసెంబర్‌ 31న రాత్రి హంగామా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ముఖ్యంగా హైదరాబాదీలు రాత్రి రోడ్లపై చేసే హంగామా ఓ రేంజ్‌లో ఉంటుంది. హోటల్స్‌, మాల్స్‌, పబ్స్‌ ఇలా అన్నీ అర్థరాత్రి వరకు ఓపెన్‌ ఉంటాయి. దీంతో నగర పౌరులు డిసెంబర్‌ 31ని గ్రాండ్‌గా ప్లాన్‌ చేసుకుంటారు. ఇలాంటి వారి కోసమే ప్రయాణానికి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో హైదరాబాద్‌ మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది. ఈరోజు రాత్రి మెట్రో వేళలను పొడగిస్తున్నట్లు ప్రకటన చేశారు. డిసెంబర్ 31వ తేదీన అర్థరాత్రి ఒంటి గంట వరకు మెట్రో రైల్స్‌ నడపనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ రోజు రాత్రి మెట్రో రైల్ 12.15 కి బయలుదేరి…1 గంటకి చివరి చేరుకోనుంది.

కేవలం పని వేళల పెంపు మాత్రమే కాకుండా ప్రయాణికుల భద్రత విషయంలో కూడా మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది. న్యూ ఇయర్‌ వేడుకల నేపథ్యంలో గొడవలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో భద్రతను పెంచనున్నారు. మెట్రో స్టేషన్స్‌లో మద్యం తాగడం, గొడవ పడకుండా తోటి ప్రయాణికులకు సహకరించాలని సూచించారు. ఇదిలా ఉంటే ఆర్టీసీ కూడా ఈ రోజు రాత్రి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు తెలుస్తోంది. గతేడాది తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపిన విషయం తెలిసిందే. అయితే ఎక్కడ ఎక్కారు, ఎక్కడ దిగారన్న దాంతో సంబంధం లేకుండా.. బస్సు ఎక్కి దిగితే ఒకే ఛార్జీని వసూలు చేశారు. ఈసారి కూడా అదే విధానాన్ని అమలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

దీనిపై మరికాసేపట్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. డిసెంబర్ 31 రాత్రి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదనే ఉద్దేశంతో పోలీసులు కఠిన నిబంధనలు విధించనున్నారు. ముఖ్యంగా మద్యం సేవించి వాహనం నడిపే వారికి భారీ జరిమానాతో పాటు, జైలు శిక్ష విధించననున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ప్రజలకు అందుబాటులోకి రవాణా సదుపాయం తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..