Hyderabad: ప్రేమ పేరుతో కాలేజీ యువతులకు వల.. ఆపై పెళ్లి.. చివరకు ప్రైవేటు వీడియోలతో..

హైదరాబాద్‌లో నిత్య పెళ్లికొడుకు బాగోతం బట్టబయలైంది. ప్రేమ పేరుతో కాలేజీ అమ్మాయిలను ట్రాప్‌ చేస్తున్న కేటుగాడికి కళ్లెం వేశారు పోలీసులు.. ఓ యువతి హైదరాబాద్‌ అత్తాపూర్‌ పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడు ప్రేమ పేరుతో కాలేజీ యువతులకు వల వేసి.. నీచమైన పనులు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Hyderabad: ప్రేమ పేరుతో కాలేజీ యువతులకు వల.. ఆపై పెళ్లి.. చివరకు ప్రైవేటు వీడియోలతో..
Crime News

Updated on: Aug 18, 2025 | 9:39 AM

హైదరాబాద్‌లో నిత్య పెళ్లికొడుకు బాగోతం బయటపడింది. ప్రేమ పేరుతో కాలేజీ అమ్మాయిలకు వలవేసి, వారిని పెళ్లి చేసుకుని మోసం చేశాడు. అలా ముగ్గురు అమ్మాయిలను పెళ్లి చేసుకున్న యువకుడు.. వారి ప్రైవేటు వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్‌ చేశాడు. బాధిత యువతి హైదరాబాద్‌ అత్తాపూర్‌ పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌ అత్తాపూర్‌కు చెందిన రఫీ.. తన పేరును రవికుమార్‌గా మార్చుకుని కాలేజీ అమ్మాయిలకు వల వేసేవాడు. వారికి మాయమాటలు చెప్పి వారిని లోబరచుకునేవాడు. తన వలలో పడిన అమ్మాయిలను పెళ్లి కూడా చేసుకునేవాడు. అలా ముగ్గురు యువతులను పెళ్లి చేసుకున్న రఫీ అలియాస్‌ రవికుమార్‌.. వారితో సన్నిహితంగా ఉన్న సమయంలో వీడియోలు తీశాడు. అనంతరం ఆ ప్రైవేటు వీడియోలు చూపించి సదరు యువతులను బ్లాక్‌మెయిల్‌ చేయడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో రఫీ టార్చర్‌ తట్టుకోలేని ఓ యువతి అత్తాపూర్ పోలీసులను ఆశ్రయించింది. బాధిత యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

రఫీ.. ముగ్గురు అమ్మాయిలను ట్రాప్ చేసి.. పెళ్లి చేసుకుని.. బ్లాక్‌మెయిల్‌ చేసేవాడని పోలీసులు పేర్కొంటున్నారు. ముందుగా వారికి మాయమాటలు చెప్పి వారిని లోబరచుకునేవాడని.. తన వలలో పడిన అమ్మాయిలను పెళ్లి చేసుకుని.. టార్చర్ చేసేవాడని తెలిపారు. ఈఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. బాధిత యువతి హైదరాబాద్‌ అత్తాపూర్‌ పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చిందన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..