Hyderabad: ఆవరించిన అనుమానం.. పట్టాలపై ఉన్న డెడ్‌బాడీ చెప్పిన నిజం.. నీరున్న బకెట్‌లో తల ముంచి

|

Jun 29, 2022 | 7:23 PM

వాళ్లిద్దరు ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. కొద్ది రోజులపాటు కాపురం సజావుగా సాగింది. కానీ అనుమానం పెనుభూతంగా మారి.. చివరికి వారి దాంపత్య జీవితం విషాదాంతం అయ్యింది.

Hyderabad: ఆవరించిన అనుమానం.. పట్టాలపై ఉన్న డెడ్‌బాడీ చెప్పిన నిజం.. నీరున్న బకెట్‌లో తల ముంచి
Hyderabad Crime
Follow us on

Telangana: పరిచయం స్నేహంగా.. స్నేహం ప్రేమగా మారింది. కలిసి బతకాలని నిర్ణయించుకున్నారు. తమను విడదీయడం ఎవరి తరం కాదనుకున్నారు. మొత్తానికి ప్రేమపెళ్లి చేసుకున్నారు. ఒకరికి ఒకరు ప్రాణంగా.. ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్లిద్దరు. ఎటు వెళ్లినా కలిసే వెళ్లేవాళ్లు. భవిష్యత్‌ను అందంగా ఊహించుకోవడమే కాదు. తమ కలలను నిజం చేసుకునేలా ఇద్దరూ ఉద్యోగాల్లో చేరారు. ఊరుగాని ఊర్లో కాపురం. ఐతేనేం ఇష్టంగా కష్టపడ్డారు. సాఫీగా సాగిపోతోన్న కాపురంలో ఒక్కసారిగా అలజడి. ఆమె తరుచూ ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడ్డం అతనికి నచ్చలేదు. పేరెంట్సో.. ఫ్రెండ్సో అని సర్దిపెట్టుకున్నాడు. కానీ ఏదో మూల అనుమాన బీజం నాటుకుంది అతని మనసులో. ఒక రోజు ఆమె తమకు తెలిసిన వాళ్లతో కాస్త క్లోజ్‌గా మాట్లాడ్డం అతని కంటపడింది. అంతే ఈ దృశ్యం అతనిలో అనుమానానికి మరింత ఆజ్యం పోసింది.ప చ్చని కాపురంలో చిచ్చు రగిలింది. నువ్వే నా ప్రాణం అని ప్రేమ కురిపించిన వ్యక్తిలో సడెన్గా శాడిజం జాడలు కన్పించాయి. చిన్న విషయానికి కూడా గొడవపడేవాడు. కావాలని గొడవకు దిగడం..కొట్టడం.. అతని వైఖరి శృతిమించింది. ఎంతలా అంటే తను ఆరో ప్రాణంగా భావించిన ఇల్లాలిని చంపేంతగా. ఆవేశంలో విచక్షణ మరిచాడు. కోపంలో రాక్షసుడయ్యాడు. అతనిలో పేరుకుపోయిన అనుమానం ముందు.. ఆమె తన పట్ల చూపిన ప్రేమ..తన కోసం ఆమె కన్నవాళ్లను వదిలిరావడం ఇవన్నీ మాయమయ్యాయి. పశుబలంతో పేట్రేగాడు. కాపాడాల్సిన భర్తయి వుండి భార్యను బలితీసుకున్నాడు.

ఇది కథ కాదు. యదార్థం.  పంపా సర్కార్‌ అనే వివాహిత హత్యోదంతం వెలుగులోకి రాకముందే హైదరాబాద్‌ నాంపల్లి స్టేషన్‌ వద్ద అలజడి రేగింది. పట్టాలపై ఓ వ్యక్తి శవం. సీన్‌ ఆఫ్‌ అఫెన్స్‌ను బట్టీ ట్రైన్‌ కింద పడిసూసైడ్‌ చేసుకున్నట్టు నిర్దారణయింది. అతని జేబులో ఓ లెటర్. అదీ అసోం బాషలో రాసివున్న ఉత్తరం. ట్రాన్స్‌లేట్‌ చేసి చూస్తే..సంచలనవార్త. కట్‌ చేస్తే ఖైరతాబాద్‌లోని ఓ కాలనీలో కలకలం. గల్లీలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం. స్థానికులు ఓ ఇంటి ముందు గుమిగూడారు. పోలీసులు, క్లూస్‌ టీమ్స్‌తో చేరుకున్నారు. అంతా హడావుడి. ఓ ఇంట్లోకి వెళ్లిన పోలీసులు.. బాత్‌ రూమ్‌లో కన్పించిన దృశ్యం నివ్వెరపోయారు. బాత్‌రూమ్‌లో డెడ్‌బాడీ. 22 ఏళ్ల పంపా సర్కార్‌ తల బకెట్‌లో కాళ్లు చేతులు బయట. అంటే తలను బకెట్‌లో ముంచడం వల్లే ఆమెచనిపోయిందా? గది బయట డంబిల్‌. దీంతో కొట్టి చంపాడా?.. అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇంట్లో తనిఖీలు నిర్వహించిన పోలీసులు, క్లూస్‌టీమ్స్‌ కీలక ఆధారాలు సేకరించారు. అన్నింటికన్నా ముఖ్యమైన ఆధారం..నాంపల్లి స్టేషన్‌ కాడ శవం చెప్పిన నిజం. ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తిజే బులో దొరికిన లెటర్‌ వల్లే పంపా సర్కార్‌ హత్యోదంతం పోలీసులకు తెలిసింది. అతనెవరో కాదు పంపా సర్కార్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న మహంత్‌ బిశ్వాస్‌.

అదీ సంగతి. పంపా సర్కార్‌, మహంత్‌ బిశ్వాస్‌ ఇద్దరిదీ అసోం. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. బతుకుబాటలో హైదరాబాద్‌కు వలస వచ్చారు. ఓ ప్రముఖ షాపింగ్‌ మాల్‌లో ఇద్దరూ జాబ్‌చేసేవాళ్లు. ఎంతో సరదాగా..స్నేహంగా వుండేవాళ్లు. కానీ ఏం లాభం. కడివెడు పాలలో ఒక్క విషం చుక్క పడ్డట్టుగా మహంత్‌ మనుసులో నాటుకున్న అనుమానం ఇంతటి అనర్ధానికి దారితీసింది. ఆవేశంలో విచక్షణమరిచి భార్యను హత్యచేశాడు. ఎందుకిలా చేశానని బాధపడ్డాడో.. చట్టానికి చిక్కక తప్పదని భయపడ్డాడో కానీ తనూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆవేశం అనర్ధాయకం. అనుమానం అంతకన్నా ప్రమాదమనడానికి ఈ ఘటనే నిదర్శనం. ఏ సమస్యకైనా చంపడమో..చావడమో పరిష్కారం కాదు. విబేదాలు, వివాదాలు జీవితంలో ఓ భాగం. సన్నిహితులతో చర్చించాలి. కౌన్సెలింగ్‌ తీసుకోవాలి. పోలీసులను ఆశ్రయించాలి.కానీ తొందరపాటు నిర్ణయాలతో జీవితాలను పణంగా పెట్టొద్దు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం  ఈలింక్ క్లిక్ చేయండి