Hyderabad: వర్షాకాలం సమీపిస్తున్న వేళ రంగంలోకి GHMC అధికారులు.. యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం..

|

Jun 09, 2022 | 7:54 AM

Hyderabad: రేపోమాపో నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి ఎంట్రీ ఇవ్వనున్నాయ్‌. ఒక్కసారి నైరుతి రుతు పవనాలు ఎంటర్‌ అయ్యాయంటే వర్షాలు మొదలైపోయినట్టే. ఈసారి భారీ వర్షాలు నమోదు కానున్నాయని...

Hyderabad: వర్షాకాలం సమీపిస్తున్న వేళ రంగంలోకి GHMC అధికారులు.. యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం..
Ghmc
Follow us on

Hyderabad: రేపోమాపో నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి ఎంట్రీ ఇవ్వనున్నాయ్‌. ఒక్కసారి నైరుతి రుతు పవనాలు ఎంటర్‌ అయ్యాయంటే వర్షాలు మొదలైపోయినట్టే. ఈసారి భారీ వర్షాలు నమోదు కానున్నాయని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. హైదరాబాద్‌లో భారీ వర్షం కారణంగా నెలకొనే పరిస్థితులు ఎలాంటివో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులో భాగంగానే జీహెచ్‌ఎమ్‌సీ అధికారులు ముందుగానే యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేసుకుంటున్నారు.

మరికొన్ని రోజుల్లో వర్షాలు కురియనున్న నేపథ్యంలో భారత వాతావరణశాఖ హెచ్చరికలను పరిగణలోకి తీసుకున్న GHMC అధికారులు, హైదరాబాద్‌లో పురాతన కట్టడాలపై ఫోకస్‌ పెట్టారు. శిథిలావస్థకు చేరిన భవనాలను కూల్చివేసేందుకు స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నారు. మంత్రి కేటీఆర్ ఆదేశాలతో శిథిలావస్థకు చేరిన బిల్డింగ్స్‌ను గుర్తిస్తున్నారు చేస్తున్నారు. ఇప్పటివరకు 524 భవనాలు శిథిలావస్థకు చేరినట్లు అధికారులు గుర్తించారు. ఈ 524 నిర్మాణాల్లో ఈ ఏడాది 236 బిల్డింగ్స్‌ను కొత్తగా గుర్తించారు. ఈ భవనాలన్నింటికీ ముందస్తు నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే 40 నిర్మాణాలను కూల్చివేసిన GHMC అధికారులు, మిగతా వాటిపైనా యాక్షన్‌కు రెడీ అవుతున్నారు.

అయితే, మరమ్మతులకు అనుకూలంగా ఉన్న 24 భవనాలకు అనుమతి ఇచ్చినట్లు GHMC టౌన్‌ ప్లానింగ్‌ వింగ్‌ వెల్లడించింది. ఆ 24 నిర్మాణాలకు రిపేర్లు కూడా కంప్లీటైనట్లు తెలిపారు అధికారులు. ఇక, మిగిలిన బిల్డింగ్స్‌పై చర్యలు కొనసాగుతాయని, ఓనర్స్‌ సహకరించాలని కోరుతున్నారు. ప్రతి సంవత్సరం వానాకాలం వచ్చిందంటే పురాతన భవనాలు ప్రమాదకరంగా మారుతున్నాయ్. గతంలో శిథిల భవనాలు కూలిపోయి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. అందుకే, ఈసారి అలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటోంది GHMC.

ఇవి కూడా చదవండి

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..