Hyderabad: కరెంట్‌షాక్‌తో ఒక్కసారిగా కుప్పకూలిపోయిన వ్యక్తి ప్రాణం నిలిపిన పోలీస్..

మారేడ్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తన్న ఓ కానిస్టేబుల్ ఓ ప్రాణాన్ని నిలబెట్టారు. సరైన సమయంలో CPR చేసి.. మానవత్వాన్ని చాటుకున్నారు. ప్రజంట్ ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Hyderabad: కరెంట్‌షాక్‌తో ఒక్కసారిగా కుప్పకూలిపోయిన వ్యక్తి ప్రాణం నిలిపిన పోలీస్..
Police Saves Life

Updated on: Jul 15, 2022 | 10:08 PM

Telangana: అకస్మాతుగా ఆగిన గుండెకు CPR చేస్తే ప్రాణం నిలబడుతుందా? ఇక లేడు అనుకున్న మనిషి బతికి బట్టకడతాడా?… ముమ్మాటికీ అలా సాధ్యమే అనిపించే ఘటన సికింద్రాబాద్‌ మారేడ్‌పల్లిలో జరిగింది. కరెంట్‌షాక్‌తో ఒక్కసారిగా కుప్పకూలిపోయిన వ్యక్తికి ఓ పోలీస్‌ CPR చేసి ప్రాణం నిలబెట్టాడు. సకాలంలో అందించిన ఈ ట్రీట్‌మెంట్‌తో అతని గుండె మళ్లీ లబ్‌డబ్‌మంది. దీంతో వెంటనే ఆస్పత్రికి తరలించేశారు.. అబ్దుల్ ఖదీర్‌ అనే కానిస్టేబుల్ సికింద్రాబాద్(secunderabad )మారేడ్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్నారు. ఆయన తన కొలిగ్స్‌తో కలిసి పెట్రోలింగ్‌కి వెళ్లిన సమయంలో మారేడ్‌పల్లి  మెయిన్‌రోడ్డులోని మైసమ్మ దేవాలయం వద్ద ఆర్చ్‌పై అలంకార తోరణాన్ని ఏర్పాటు చేస్తున్న సువేందర్ మకర్ రాకేష్ అనే వ్యక్తి కరెంట్ షాక్‌తో పైనుంచి కిందపడటం చూశారు. ఉన్నపళంగా కానిస్టేబుల్ అబ్దుల్ ఖదీర్ తనకు తెలిసిన CPRను అప్లై చేశారు. అప్పటికే రాకేష్ ఇక లేడు అని ఫిక్సైపోయిన జనం, ఖదీర్‌ CPR ట్రీట్‌మెంట్ తర్వాత ఆశ్చర్యపోయారు. రాకేష్‌లో చలనం రావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యపరిస్థితి కుదటపడినట్లు సమాచారం.


CPR అంటే.. ఒక్కసారిగా ఆగిన గుండెను ఓ పద్ధతి ప్రకారం మళ్లీ యాక్టివేట్ చెయ్యడం. దానికి కచ్చితంగా అవగాహన కావాలి. మనిషి పడిపోయిన క్షణాల వ్యవధిలో బాధితుడి చాతీపై రెండు చేతులతో ఒక క్రమ పద్ధతిలో కొడుతూ చేసే ప్రాథమిక చికిత్స వల్ల మనిషి బతికే చాన్స్ ఉందని డాక్టర్లు చెబుతూ వస్తున్నారు. ఇప్పుడు రాకేష్‌ విషయంలో ఖదీర్ చేసిన ఆ ప్రయత్నమే సత్ఫలితమిచ్చింది.

తెలంగాణ వార్తల కోసం..