Hyderabad: పాపం ఆన్‌లైన్‌లో అవకాడోలు ఆర్డర్ చేద్దామనుకుంటే.. ఇలా అయ్యింది ఏంటి..?

ప్రస్తుతం యాడ చూసినా ఆన్‌లైన్ మోసాలే. సైబర్ స్కామర్స్ రెచ్చిపోతున్నారు. రోజుకో కొత్త రకమైన మోసంతో జనాల్ని చీట్ చేస్తున్నారు. అందుకే డిజిటల్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. తాజాగా హైదారాబాద్‌కు చెందిన ఓ స్టూడెంట్.. అవకాడోలు ఆర్డర్ చేయబోయి స్కామర్స్‌కు చిక్కాడు.

Hyderabad: పాపం ఆన్‌లైన్‌లో అవకాడోలు ఆర్డర్ చేద్దామనుకుంటే.. ఇలా అయ్యింది ఏంటి..?
Avocados

Edited By: Ram Naramaneni

Updated on: Apr 26, 2025 | 8:26 PM

ఆన్ లైన్ మోసగాళ్లు కొత్త ఆలోచనలతో ప్రజలను మోసం చేస్తున్నారు. రోజుకో రకమైన ఎత్తగడతో ఖాతాల్లోని సొమ్మును కాజేస్తున్నారు. ప్రస్తుతం అంతా డిజిటల్ అవ్వడంతో.. వారికి ప్రజలు ఈజీగా దొరుకుతున్నారు. తాజాగా ఆన్‌లైన్‌లో అవకాడో కొనేందుకు యత్నించిన హైదరాబాద్‌కు చెందిన స్టూడెంట్‌ను నిట్టనిలువునా ముంచేశారు. సదరు విద్యార్థి అవకాడో గురించి సెర్చ్ చేయగా.. విజయవాడకు చెందిన బాలాజీ ట్రేడర్స్‌ సంస్థ అవకాడోలు నేరుగా ఇంటికే పంపుతామని ఆ సంస్థ ప్రతినిధులు పేరుతో ఫోన్ చేశారు. అయితే వారు స్కామర్లు అని ఆ విద్యార్థి గుర్తించలేకపోయాడు. అవకాడోలు నేరుగా ఇంటికి పంపుతున్నాం కాబట్టి ఖర్చుల కింద కొంత నగదు ఇవ్వాలని తెలిపారు. ఆ తర్వాత దారిలో అవకాడోలు తీసుకువస్తున్న వాహనం నిలిచిపోయిందని, రిపేర్ చేయించాలని మరికొంద నగదు ఇవ్వాలని బాధితుడ్ని కోరగా, అతను డబ్బు చెల్లించాడు. మరోసారి వాహనాన్ని ట్రాఫిక్ పోలీసులు ఆపారని.. ఇంకొంత నగదు కావాలని అడిగారు. ఇలా పుల దఫాలుగా బాధితుడి నుంచి రూ.2.60 లక్షల నగదును సైబర్ కేటుగాళ్లు లాగేశారు. వారి ప్రవర్తనపై అనుమానం కలగడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

సైబర్ మోసానికి గురైన వెంటనే 1930 కాల్ చేయడం లేదా… https:cybercrime.gov.in పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. నేరం జరిగిన గంటలోపు ఫిర్యాదు చేస్తే ఆ నగదును ఫ్రీజ్ చేయవచ్చని.. లేటయితే.. నేరగాళ్లు వేరు వేరు ఖాతాల్లోకి ఆ నగదు బదిలీ చేసే అవకాశం ఉందంటున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..