HMDA:హైదరాబాద్‌లో సొంతింటి కలను నిజం చేసుకునేందుకు మరో అవకాశం.. అమ్మకానికి బండ్లగూడ, పోచారం రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్లు..

|

Sep 29, 2022 | 9:39 PM

హైదరాబాద్‌లో సొంతింటి కలను నిజం చేసుకోవాలనుకునేవారికి హెచ్‌ఎండీఏ మరో అవకాశం కల్పిస్తున్నది. రంగారెడ్డి జిల్లాలో బండ్లగూడ, పోచారంలోని రాజీవ్ స్వగృహ ఫ్లాట్లను మరోసారి వేలానికి..

HMDA:హైదరాబాద్‌లో సొంతింటి కలను నిజం చేసుకునేందుకు మరో అవకాశం.. అమ్మకానికి బండ్లగూడ, పోచారం రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్లు..
Bandlaguda Pocharam Flats
Follow us on

పేదలకు సొంత ఇంటి స్థలం, తద్వారా సొంతింటి కలను నిజం చేసే దిశగా అడుగులు వేస్తోంది.హైదరాబాద్‌లో సొంతింటి కలను నిజం చేసుకోవాలనుకునేవారికి హెచ్‌ఎండీఏ మరో అవకాశం కల్పిస్తున్నది. రంగారెడ్డి జిల్లాలో బండ్లగూడ, పోచారంలోని రాజీవ్ స్వగృహ ఫ్లాట్లను మరోసారి వేలానికి పెట్టింది. గతంలో అమ్ముడు పోని అన్ని ఫ్లాట్లు ఇప్పుడు మరోసారి వేలంకు పెట్టింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను తాజాగా విడుదల చేసింది. మీ సేవ పోర్టల్, స్వగృహ వెబ్‌సైట్, మొబైల్‌యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్‌ ఆధారిత లాటరీ ద్వారా వచ్చే నెల 22న ఫ్లాట్లను కేటాయించనున్నారు.

ఈ నేపథ్యంలో టోకెన్ అడ్వాన్స్ చెల్లించేందుకుహెచ్ఎండిఏ మరో అవకాశం ఇచ్చింది. 1 BHK కు రూ.లక్ష, 2 BHK కు రూ.2 లక్షలు, 3 BHK కు రూ.3 లక్షలు టోకెన్ అడ్వాన్స్ అని తెలిపారు. ఈ టోకెన్ అడ్వాన్స్ చెల్లింపుకు అక్టోబర్ 26చివరి తేదీ అని పేర్కొంది. అయితే లాటరీ పద్ధతిలో హెచ్ఎండిఏ ప్లాట్లను కేటాయించనుంది.

గతంలో దీనిప్రకారం బండ్లగూడలో 419 ఫ్లాట్లు పూర్తిస్థాయిలో వేలం వేసింది. మరో 1082 ఫ్లాట్లలో పనులు వివిధ దశల్లో ముగిశాయి. పూర్తిగా సిద్ధమైన ఫ్లాట్ల ధరను చదరపు అడుగుకు రూ.3 వేలు, సెమీ ఫినిష్‌డ్ చదరపు అడుగుకి రూ.2,750గా నిర్ణయించింది.

మధ్య తరగతి ప్రజలకు కూడా సొంత స్థలం ఇవ్వాలి.. సొంతింటి కల నిజం చేయాలన్నదే సీఎం ఆలోచన. ఈ కార్యక్రంపై మేధోమథనం చేసి విధానాన్ని రూపొందించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమం జరిగితే మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరకు ప్లాట్లు అందుబాటులోకి రానున్నాయి. సీఎం జగన్‌ తన క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం