Hyderabad: వరుస క్లౌడ్‌బరస్ట్‌లు.. పగులుతున్న క్యుములోనింబస్‌లు.. ఎందుకీ అసాధారణ వర్షాలు!

వర్షాకాలంలో వర్షాలేగా పడేది. దీనిపై ఇంత చర్చ ఎందుకు? అలా అనుకుంటాం గానీ.. 'ఇదేం వాన' అని కూడా అనుకునే ఉంటారుగా. దాని గురించే ఈ చర్చంతా. మొన్నటిదాకా చూసిన వర్షాకాలం వేరు, ఇప్పుడు చూస్తున్న సీజన్‌ వేరు. సాధారణంగా కేరళ మీదుగా వచ్చే వర్షాలను నైరుతి అంటారు. అవి హిమాలయాలను ఢీకొట్టి తిరిగి తమిళనాడుకు చేరుకుంటాయి. వాటిని ఈశాన్య రుతుపవనాలు అంటారు. ఈసారి మాత్రం హిమాలయాలను ఢీకొట్టలేదు రుతుపవనాలు. అంతకుమించిన ఎత్తుకు వెళ్లి టిబెట్‌ను తాకాయి. ఇది అనూహ్యం, అసాధారణం. వాతావరణంలో దారుణ మార్పులు జరగబోతున్నాయనడానికి ఇదే మొదటి మెట్టు. ఇకపై ఊహించని వర్షాలు, వరదలు, క్లౌడ్‌బరస్ట్‌లు, క్యుములోనింబస్‌ మేఘాలు బద్దలవటాలు.. అత్యంత సర్వసాధారణంగా జరగబోతున్నాయి. మరి.. పర్టిక్యులర్‌ రీజన్‌ ఏంటి? వాతావరణ మార్పులు అంటే ఏవిధమైన మార్పులు? మున్ముందు చూడబోయే దారుణ పరిస్థితులేంటి?

Hyderabad: వరుస క్లౌడ్‌బరస్ట్‌లు.. పగులుతున్న క్యుములోనింబస్‌లు.. ఎందుకీ అసాధారణ వర్షాలు!
Heavy Rains

Updated on: Sep 25, 2025 | 9:04 PM

‘ముసురేసింది’ ఈ పదం విన్నామా ఈ సీజన్‌లో. రోజంతా చిరుజల్లులు పడడం చూశామా ఈ వర్షాకాలంలో. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా, ఒక్కసారి కూడా ముసురు పట్టిన ఇన్సిడెంట్సే లేవు ఈ ఏడాది. అయితే అతివృష్టి లేదా అనావృష్టి. ఆ రోజుల్లోకి వచ్చేసినట్టే మనం. మెయిన్‌గా అతివృష్టి. వర్షపు జల్లులు జడివానగా, వరదలు జలప్రళయంలా మారుతున్నాయి. చాలా అరుదుగా వచ్చే క్లౌడ్‌బరస్ట్‌లు, క్యుములోనింబస్‌లు వెంటవెంటనే చూస్తున్నాం. ఇవన్నీ దేనికి సంకేతం? జమ్ము-కశ్మీర్‌, హిమాచల్‌, ఉత్తరాఖండ్‌లో మేఘ విస్ఫోటనాలు ఏర్పడుతున్నాయంటే.. దానికో రీజన్‌ ఉంది. మరి.. దక్కన్‌ పీఠభూమి అయిన తెలంగాణలో ఎందుకని క్లౌడ్‌బరస్ట్‌ తరహా వానలు పడుతున్నాయి. గంటల్లోనే 20 సెంటీమీటర్ల వర్షం ఎందుకు పడుతోంది. ఎప్పుడైనా సరే తెలంగాణలో భారీ వర్షాలు పడడానికి కారణం… ఇది ఇంటర్‌లాక్‌ రీజియన్‌ అవడం. అంటే.. రెండు వైపుల సముద్రాలు, మధ్యలో ఎత్తైన ప్రాంతంలో తెలంగాణ ఉండడం. ఓవైపేమో అరేబియో, మరోవైపు బంగాళాఖాతం. ఈ రెండు సముద్రాలకు సరిగ్గా మధ్యలో తెలంగాణ ఉండడం వల్లే ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల వైపు ఎక్కువ వర్షం పడుతుంది. అయితే, మొన్న కామారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో ఊహించని స్థాయిలో వర్షాలు పడడానికి కారణం మాత్రం.. రుతుపవన గమనం ఒంపు తిరగడం వల్లేనంటున్నారు. ఆదిలాబాద్‌, ఖమ్మం, ములుగు వంటి జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడుతున్నాయంటే కారణం.. అక్కడి అడవులు, గోదావరి నది. కాని, మెదక్, కామారెడ్డి లాంటి ఏరియాల్లో వాతావరణ శాఖ కూడా...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి