Hyderabad: మళ్లీ నగరాన్ని కమ్మేస్తున్న నల్లటి మేఘాలు – భారీ వర్షసూచన

గ్రేటర్ హైదరాబాద్‌ పలు ప్రాంతాల్లో మరో గంటలో ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మియాపూర్‌ నుంచి శంషాబాద్‌ వరకు పలు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ జీహెచ్‌ఎంసీ హెచ్చరికలు జారీ చేసింది. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ మీ కోసం...

Hyderabad: మళ్లీ నగరాన్ని కమ్మేస్తున్న నల్లటి మేఘాలు - భారీ వర్షసూచన
Hyderabad Weather

Updated on: Jul 19, 2025 | 2:40 PM

హైదరాబాద్‌ నగరంపై మళ్లీ మేఘాలు కమ్ముకుంటున్నాయి. మరో గంటలో గ్రేటర్ పరిధిలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు మియాపూర్, ఆర్సీపురం, బీరంగుడా, శేరిలింగంపల్లి, హయత్‌నగర్, చాంద్రాయణగుట్ట, బాలాపూర్, శంషాబాద్, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో పడే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.

మధ్యాహ్నం 2:30 తర్వాత వర్షపాతం ప్రారంభమయ్యే అవకాశముందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో.. జీహెచ్‌ఎంసీ (GHMC) అధికారులు అప్రమత్తమయ్యారు. నగరవాసులు జాగ్రత్తలు తీసుకోవాలి సూచిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించేవారు, ట్రాఫిక్ బాగా ఉండే ప్రాంతాల్లో ప్రయాణించేవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. అవసరమైతే GHMC హెల్ప్‌లైన్ – 040-21111111 లేదా 9000113667 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..