Hyderabad MMTS: హైదరాబాదీలకు గుడ్‌ న్యూస్‌.. MMTS ఛార్జీలను 50% వరకు తగ్గిస్తూ నిర్ణయం..

|

May 03, 2022 | 3:43 PM

Hyderabad MMTS: హైదరాబాద్ నగర వాసులకు తక్కువ ధరలో ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తూ వస్తోన్న ఎమ్‌ఎమ్‌టీఎస్‌ ఛార్జీలను తగ్గిస్తూ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫస్ట్ క్లాస్‌ ఛార్జీలను 50 శాతం మేర తగ్గించారు...

Hyderabad MMTS: హైదరాబాదీలకు గుడ్‌ న్యూస్‌.. MMTS ఛార్జీలను 50% వరకు తగ్గిస్తూ నిర్ణయం..
Mmts Trains
Follow us on

Hyderabad MMTS: హైదరాబాద్ నగర వాసులకు తక్కువ ధరలో ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తూ వస్తోన్న ఎమ్‌ఎమ్‌టీఎస్‌ ఛార్జీలను తగ్గిస్తూ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫస్ట్ క్లాస్‌ ఛార్జీలను 50 శాతం మేర తగ్గించారు. సబర్బన్‌ ఫస్ట్‌ క్లాస్‌ సింగిల్‌ జర్నీ ఛార్జీల తగ్గింపు ధరలు మే 05 నుంచి అమల్లోకి రానున్నాయి. అధికారులు తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రతీ రోజూ నగరంలో ఎమ్‌ఎమ్‌టీఎస్‌ రైళ్లలో ప్రయాణించే ఉద్యోగులు, విద్యార్థులకు ఎంతో మేలు జరగనుంది.

తగ్గించిన ధరలకు అనుగుణంగా సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ డివిజన్లలోని సబర్బన్‌ సెక్షన్లలో ఎమ్‌ఎమ్‌టీఎస్‌ రైళ్లలో ప్రయాణించే ప్రయాణికుల సింగిల్‌ జర్నీ ఫస్ట్‌ క్లాస్‌ ఛార్జీలు తగ్గనున్నాయి. తగ్గిన ఛార్జీల పూర్తి వివరాలను దక్షిణ మధ్య రైల్వే అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో షేర్‌ చేశారు. ఇదిలా ఉంటే కరోనా కారణంగా రద్దు చేసిన ఎమ్‌ఎమ్‌టీఎస్‌ రైళ్లను అధికారులు పునరుద్దరించే పనిలో పడ్డారు. ఇందులో భాగంగానే సర్వీసుల సంఖ్యను క్రమంగా పెంచుతూ పోతున్నారు. ప్రస్తుతం ఫలక్‌నుమా ` సికింద్రాబాద్‌ ` హైదరాబాద్‌ ` బేగంపేట ` లింగంపల్లి ` తెల్లాపూర్‌ ` రామచంద్రాపురం మధ్య 29 రైల్వే స్టేషన్లను కవర్‌ చేస్తూ 50 కిమీల మీదుగా 86 సర్వీసులను నడుపుతోంది.

ఈ విషయమై దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ (ఇన్‌చార్జి) శ్రీ అరుణ్‌ కుమార్‌ జైన్‌ మాట్లాడుతూ తగ్గించిన ఛార్జీల ప్రయోజనాన్ని ప్రయాణికులందరూ వినియోగించుకోవాలని కోరారు. వేసవికాలం, ఎమ్‌ఎమ్‌టీఎస్‌ ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరుగుతున్న ఈ సమయంలో ఫస్ట్‌ క్లాస్‌ చార్జీల తగ్గింపు ప్రయాణికులకు ఎంతో అనుకూలంగా ఉంటుందని ఆయన అన్నారు.

తగ్గిన ఛార్జీల పూర్తి వివరాలు..

మరిన్ని హైదరాబాద్ వార్తలకు క్లిక్ చేయండి..

Also Read: చైనా 73 ఏళ్లలో తొలిసారిగా మేడే జరుపుకోలేదు.. కారణం తెలిస్తే అదురుపుట్టడం ఖాయం!

Jagga Reddy: హీరో రజినీకాంత్ స్టైల్‌లో ఉంది సీఎం కేసీఆర్ పాలన.. ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

Akshaya Trutiya 2022: తెలుగు రాష్ట్రాల్లో అక్షయ తృతీయ శోభ.. కిటకిటలాడుతున్న గోల్డ్ షాప్స్.. కొనే ముందు ఈ విషయాలు తీసుకోండి..