1 Crore Cash Seized: అక్రమంగా తరలిస్తున్న నగదు అక్కడక్కడ పట్టుబడుతూనే ఉంది. తాజాగా ఇన్నోవా కారులో అక్రమంగా తరలిస్తున్న కోటి రూపాయల నగదును నార్సింగ్ పోలీసులు పట్టుకోవడం సంచలనంగా మారింది. సోమవారం సాయంత్రం మంచిరేవుల వద్ద పోలీసులు తనిఖీ నిర్వహిస్తుండగా, ఇన్నోవా కారును తనిఖీ చేశారు. దీంతో కారులో తరలిస్తున్న ఈ భారీ మొత్తం పట్టుబడింది. ఈ నగదు తరలిస్తున్న ముగ్గురిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. నిందితులు నగదుకు సంబంధించిన సరైన ఆధారాలు చూపించకపోవడంతో వాటిని సీజ్ చేసి, వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే నిందితులు బ్యాంకు ఖాతాలను హ్యాక్ చేసినట్లు తెలుస్తోంది.
బ్యాంకు ఖాతాల్లో ఎక్కువ రోజులు విత్‌డ్రా చేయకుండా ఉన్న నగదును గుర్తించి వాటిని తమ ఖాతాల్లోకి మళ్లించుకుని ట్రాన్సఫర్ చేసుకుని తీసుకెళ్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న నగదును ఆదాయపన్ను శాఖ వారికి అప్పగించారు పోలీసులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హవాలా లావాదేవీలకు ఈ నగదు ఉపయోగిస్తుంటారని పోలీసులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి: