Hyderabad: శునకాల సమస్యపై పోలీస్ స్టేషన్‌లో చిన్నారుల ఫిర్యాదు

|

Jul 22, 2024 | 9:29 AM

కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలో చిన్నారులు వినూత్న నిరసన తెలిపారు. మున్సిపల్ కమిషనర్‌, చైర్మన్‌పై పోలీసులకు కంప్లైంట్ చేశారు. కుక్కల నుంచి తమకు రక్షణ కల్పించాలని నిరసన తెలిపారు. ఆ డీటేల్స్ తెలుసుకుందాం పదండి....

Hyderabad: శునకాల సమస్యపై పోలీస్ స్టేషన్‌లో చిన్నారుల ఫిర్యాదు
Children Protest
Follow us on

కుక్కల దాడులపై మేడ్చల్‌ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలో చిన్నారులు వినూత్న నిరసన తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి అంకుల్.. కుక్కల దాడుల నుంచి తమకు రక్షణ కల్పించాలంటూ చిన్నారులు ఫ్లకార్డులు ప్రదర్శించారు. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పటికే పలుసార్లు మున్సిపల్ కమిషనర్‌కి కంప్లైంట్ చేసినా పట్టించుకోవడం లేదంటూ ఆరోపించారు. అటు పిల్లల కంప్లైంట్ పై చర్యలు తీసుకుంటామని చెప్పారు పేట్ బషీరాబాద్ పోలీసులు.

సీఎం రేవంత్ రెడ్డి అంకుల్, కమిషనర్ అంకుల్, ఎమ్మెల్యే వివేక్ అంకుల్ మా ప్రాణాలకు రక్షణ ఏది అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. చిన్నారులు తల్లిదండ్రులతో సహా పోలీస్ స్టేషన్‍‌కు చేరుకుని అధికారులపై ఫిర్యాదు చేశారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కొంపల్లిలోని పలు కాలనీల్లో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయని.. దొరికిన వాళ్లని దొరికినట్లు వేటాడుతున్నాయి. కాలనీల్లో ప్రజలు బైటకి రానంతగా కుక్కలు విచ్చలవిడిగా తిరుగుతున్నాయని, వాటి బారీ నుండి తమకు రక్షణ కల్పించాలని ఎన్నో సార్లు మున్సిపల్ అధికారులకు కంప్లైంట్ చేసిన కనీస జాగ్రత్తలు తీసుకోకుండా అలసత్వం వహిస్తున్నారని అవేదన వ్యక్తం చేశారు చిన్నారులు. వీధి కుక్కల దాడిలో చిన్నారులు మృతి చెందిన ఘటనలు రోజురోజుకు వెలుగు చూస్తున్నాయి. ఇంత మంది పిల్లలు ఒక్కసారిగా పోలీస్ స్టేషన్ కు రావడం చూసి అధికారుల తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈమధ్యనే ఓచిన్నారిని కుక్కలు విచక్షణారహితంగా దాడి చేయడంలో మృతి చెందింది. దీనిపై సీఎం సైతం దిగ్భాంతి వ్యక్తం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..