TSRTC: క్రికెట్అభిమానుల‌కు టీఎస్‌ ఆర్టీసీ శుభ‌వార్త..! ఎం.డీ సజ్జనార్‌ కీలక ప్రకటన.. అదేంటంటే..

|

Jan 24, 2024 | 6:21 PM

ఈ బస్సులు ప్రతిరోజూ ఉద‌యం 8 గంట‌లకు ప్రారంభ‌మై.. తిరిగి స్టేడియం 7 గంట‌ల వ‌ర‌కు స్టేడియం నుంచి ఈ బస్సులు బ‌య‌లుదేరుతాయి. మ్యాచ్‌ని వీక్షించేందుకు ఈ ప్రత్యేక బస్సులను ఉపయోగించుకోవాల్సిందిగా క్రికెట్ అభిమానులను TSRTC అభ్యర్థిస్తోంది” అని TSRTC MD VC సజ్జనార్ ఎక్స్‌లో పోస్ట్‌ ద్వారా ప్రకటించారు.

TSRTC: క్రికెట్అభిమానుల‌కు టీఎస్‌ ఆర్టీసీ శుభ‌వార్త..! ఎం.డీ సజ్జనార్‌ కీలక ప్రకటన.. అదేంటంటే..
TSRTC
Follow us on

Hyderabad: భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య ఉత్కంఠభరితమైన టెస్ట్‌ మ్యాచ్‌ని వీక్షించేందుకు సిద్ధమవుతున్న క్రికెట్‌ అభిమానులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) గుడ్‌న్యూస్‌ చెప్పింది.. క్రికెట్‌ మ్యాచ్‌ కోసం వెళ్లేందుకు సిద్ధపడుతున్న అభిమానుల రాకపోకలను సులభతరం చేసేందుకు టీఎస్‌ఆర్టీసీ స్పెషల్ బస్సులను నడపనుంది. జనవరి 25-29 మధ్య ఐదు రోజుల పాటు ఉప్పల్‌ స్టేడియంకు అరవై ప్రత్యేక బస్సులను నడపనుంది. ఆర్‌జిఐసి స్టేడియం మీదుగా ఉప్పల్‌కు సాధారణ సర్వీసులతో పాటు మ్యాచ్ కోసం ఈ ప్రత్యేక బస్సులను నడుపుతామని ప్రజా రవాణా సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.

‘క్రికెట్ అభిమానులకు శుభవార్త! ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో రేపటి నుంచి ఐదు రోజుల పాటు భారత్ వర్సెస్ ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్ సందర్భంగా TSRTC ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి స్టేడియంకు 60 బస్సులు నడపనున్నారు. ఈ బస్సులు ప్రతిరోజూ ఉద‌యం 8 గంట‌లకు ప్రారంభ‌మై.. తిరిగి స్టేడియం 7 గంట‌ల వ‌ర‌కు స్టేడియం నుంచి ఈ బస్సులు బ‌య‌లుదేరుతాయి. మ్యాచ్‌ని వీక్షించేందుకు ఈ ప్రత్యేక బస్సులను ఉపయోగించుకోవాల్సిందిగా క్రికెట్ అభిమానులను TSRTC అభ్యర్థిస్తోంది” అని TSRTC MD VC సజ్జనార్ ఎక్స్‌లో పోస్ట్‌ ద్వారా ప్రకటించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..