ఇక నీరు వృథా చేస్తే జ‌రిమానా: జీహెచ్‌ఎంసీ కమిషనర్‌

| Edited By: Pardhasaradhi Peri

Jul 20, 2019 | 10:18 PM

ఇకపై ప్రతిరోజు జీహెచ్‌ఎంసీ, జలమండలి సిబ్బంది క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తారని.. నీటిని వృథాగా వదిలేవారిని గుర్తించి భారీగా జరిమానాలు విధిస్తామ‌ని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దానకిశోర్ తెలిపారు. దానకిషోర్‌ ఆధ్వర్యంలో జీహెచ్‌ఎంసీ, జలమండలి ఉన్నతాధికారుల సంయుక్త సమావేశం శనివారం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్‌ స్పందిస్తూ.. ఇళ్లు, వాహనాలు కడగడం ద్వారా భారీగా నీరు వృథా అవుతుందన్నారు. నీరు వృథా చేసేవారిని గుర్తించి జరిమానాలు విధించాలని నిర్ణయించినట్లు తెలిపారు. నగరవాసులకు మంచినీటి సరఫరాకు రూ.700 కోట్లు విద్యుత్‌ఛార్జీలు చెల్లిస్తున్నట్లు […]

ఇక నీరు వృథా చేస్తే జ‌రిమానా: జీహెచ్‌ఎంసీ కమిషనర్‌
Follow us on

ఇకపై ప్రతిరోజు జీహెచ్‌ఎంసీ, జలమండలి సిబ్బంది క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తారని.. నీటిని వృథాగా వదిలేవారిని గుర్తించి భారీగా జరిమానాలు విధిస్తామ‌ని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దానకిశోర్ తెలిపారు. దానకిషోర్‌ ఆధ్వర్యంలో జీహెచ్‌ఎంసీ, జలమండలి ఉన్నతాధికారుల సంయుక్త సమావేశం శనివారం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్‌ స్పందిస్తూ.. ఇళ్లు, వాహనాలు కడగడం ద్వారా భారీగా నీరు వృథా అవుతుందన్నారు. నీరు వృథా చేసేవారిని గుర్తించి జరిమానాలు విధించాలని నిర్ణయించినట్లు తెలిపారు. నగరవాసులకు మంచినీటి సరఫరాకు రూ.700 కోట్లు విద్యుత్‌ఛార్జీలు చెల్లిస్తున్నట్లు చెప్పారు. రూ.200 కోట్ల మేర విద్యుత్‌ బిల్లులకు సరపడా నీరు వృథాగా పోతుందన్నారు. జీహెచ్‌ఎంసీ, జలమండలి ఆధ్వర్యంలో చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు.