Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ఎంత బుద్ధిమంతుడో పూజ చేస్తున్నాడు అనుకునేరు – ఆ పటాలు అలా కదిలించగానే గుట్టు వీడింది

అతని ఇంట్లో గంజాయి ఉందని.. అతను గంజాయి వ్యాపారం చేస్తున్నాడని పోలీసులకు పక్కా సమాచారం వచ్చింది. దీంతో పోలీసులు సోదాలు చేసేందుకు వెళ్లారు. వారు వెళ్లేసరికి నిందితుడు దేవుడు పటాల ముందు పూజ చేస్తూ కనిపించాడు. ఇళ్లంతా వెతికినా గంజాయి కనిపించలేదు. అనుమానం వచ్చి...

Hyderabad: ఎంత బుద్ధిమంతుడో పూజ చేస్తున్నాడు అనుకునేరు - ఆ పటాలు అలా కదిలించగానే గుట్టు వీడింది
Ganja Caught
Ram Naramaneni
|

Updated on: Jul 05, 2025 | 4:24 PM

Share

తెలంగాణలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా చెక్‌పోస్టుల ఏర్పాటు చేయడంతో పాటు, నిరంతర తనిఖీలతో స్మగ్లర్ల ముఠాలను పట్టుకుంటున్నారు. కానీ స్మగ్లర్లు మాత్రం రోజురోజుకు ఇస్మార్ట్ ఐడియాలతో చెలరేగిపోతున్నారు. సామాన్యంగా కార్లలో, బైకుల డిక్కీలో, బ్యాగుల్లో గంజాయి దాచడం సహజమే. కానీ హైదరాబాద్‌లో చోటు చేసుకున్న ఒక ఘటన మాత్రం పోలీసులను ఆశ్చర్యానికి గురి చేసింది.

దూల్‌పేటకు చెందిన రోహన్ సింగ్ అనే యువకుడు గంజాయి రవాణాలో వినూత్నమైన మార్గాన్ని ఎంచుకున్నాడు. ఒడిశా నుంచి భారీగా గంజాయి తీసుకొచ్చిన అతడు…ఇంట్లో ఎక్కడ దాచాడో తెలిస్తే మీ మైండ్ బ్లాంక్ అవుతుంది. అతడి వద్ద గంజాయి ఉందన్న పక్కా సమాచారం అందుకున్న ఎక్సైజ్ పోలీసులు ఇంటిపై సోదాలు నిర్వహించారు. ఇంట్లో అణువణువూ గాలించినా ఎక్కడా గంజాయి లభ్యమవ్వలేదు.

అయితే పోలీసులు అంతలా చెక్ చేస్తున్నా.. ఇంట్లోని దేవుని ఫోటోల ముందు పూజ చేస్తూ రోహన్ సింగ్ కదలకపోవడంతో.. అతని వ్యవహారంపై అధికారులకు అనుమానం కలిగింది. అతను పూజల చేస్తోన్న ఫొటోలను పరిశీలించగా వాటి వెనక గంజాయి ప్యాకెట్లు దొరికాయి. వెంటనే రోహన్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. బండారం బట్టబయలు అయింది. ఎస్కేప్ అయ్యేందుకు ప్రయత్నించిన రోహన్‌ను పోలీసులు అప్రమత్తంగా ఉండి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో రోహన్ ఒడిశా నుంచి గంజాయి తెచ్చి దూల్‌పేటలో దాచిపెట్టి.. గచ్చిబౌలి తదితర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నట్టు వెల్లడైంది. అతడి వద్ద నుంచి 10 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం అతడిపై సంబంధిత కేసులు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

హ్యాట్సాఫ్‌! ట్రయథ్లాన్‌లో చరిత్ర సృష్టించిన.. టాలీవుడ్ హీరోయిన్.
హ్యాట్సాఫ్‌! ట్రయథ్లాన్‌లో చరిత్ర సృష్టించిన.. టాలీవుడ్ హీరోయిన్.
నయన్‌పై ధనుష్‌తో పాటు మరో నిర్మాత సీరియస్.. 5 కోట్లకు నోటీస్‌
నయన్‌పై ధనుష్‌తో పాటు మరో నిర్మాత సీరియస్.. 5 కోట్లకు నోటీస్‌
తన సినిమా ప్రివ్యూ చూస్తూ.. కుప్పకూలిన టాలీవుడ్ డైరెక్టర్
తన సినిమా ప్రివ్యూ చూస్తూ.. కుప్పకూలిన టాలీవుడ్ డైరెక్టర్
3 ఏళ్ల నిషేధం తర్వాత మళ్లీ ఫ్రీ ఫైర్ గేమింగ్‌.. ఎప్పటి నుంచి అంటే
3 ఏళ్ల నిషేధం తర్వాత మళ్లీ ఫ్రీ ఫైర్ గేమింగ్‌.. ఎప్పటి నుంచి అంటే
ముందు నుయ్యి.. వెనుక గొయ్యి.. చిక్కుల్లో 29 మంది తారలు..
ముందు నుయ్యి.. వెనుక గొయ్యి.. చిక్కుల్లో 29 మంది తారలు..
చిన్న తప్పుతో.. EDకి అడ్డంగా దొరికిన టాలీవుడ్ స్టార్స్
చిన్న తప్పుతో.. EDకి అడ్డంగా దొరికిన టాలీవుడ్ స్టార్స్
సినిమాల్లో నటించాలనుకునే వారికి సూపర్ డూపర్ ఛాన్స్..
సినిమాల్లో నటించాలనుకునే వారికి సూపర్ డూపర్ ఛాన్స్..
ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిని పొడిచి.. రక్తపు మడుగులో తాళి కట్టి
ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిని పొడిచి.. రక్తపు మడుగులో తాళి కట్టి
నా పిల్లిని చూసుకోండి.. కోట్లు అందుకోండి.. అబ్బా బంపర్ ఆఫర్ మామా
నా పిల్లిని చూసుకోండి.. కోట్లు అందుకోండి.. అబ్బా బంపర్ ఆఫర్ మామా
ఇది ఇల్లేనా ?? ఇలా కట్టారేంటి ?? ఎవరైనా ఉంటారా దీనిలో
ఇది ఇల్లేనా ?? ఇలా కట్టారేంటి ?? ఎవరైనా ఉంటారా దీనిలో